కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి విషయంలో అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఉగ్రవాదులను పట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా, పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను సంస్థలు విడుదల చేశాయి..
ప్రత్యక్ష సాక్షుల ఇచ్చిన సమాచారం ఆధారంగా, పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను సంస్థలు విడుదల చేశాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో అశాంతిని రగిలించానే దుర్భుద్ధితో ఉగ్రవాదులు ఈ దాడులకు దిగారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో 26 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.
: Sketches of Pahalgam attack terrorists have been released. చిత్రం చూడండి
— Aditya Raj Kaul (@AdityaRajKaul)
ఘటన అనంతరం ఉగ్రవాదులు పక్కనే ఉన్న అడవి నుంచి పారిపోయారు. దీంతో వారిని ఎలాగైనా ప్రాణాలతో పట్టుకోవాలని అధికారులు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే రెండు బృందాలుగా ఎన్ఐఏ రంగంలోకి దిగింది. సౌదీ అరేబియా పర్యటను మధ్యలోనే రద్దు చేసుకొని భారత్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిరాగానే విమానశ్రయంలోనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కశ్మీర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంపై ప్రధాని చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రత చర్యలను చేపట్టారు. కశ్మీర్ వ్యాప్తంగా హైఅలర్ట్ జారీ చేశారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఉగ్రవాదులు తప్పించుకుని పోయిన అడవి ప్రాంతంలో గస్తీ కాస్తున్నారు. హెలికాప్టర్‌ల సహాయంతో ఉగ్రవాదులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.