గుజరాత్ కు చెందిన ఆర్టీసీ బస్సు వెనకాల గ్లాస్ పగలడంతో పలువురు విద్యార్థులు కింద పడ్డారు. డ్రైవర్ వేగాన్ని తగ్గించకుండా స్పీడ్ బ్రేకర్ ఎక్కించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అది ఓ ఆర్టీసీ బస్సు.. ఎప్పటిలాగే ప్రయాణికులను ఎక్కించుకొని గమ్యస్థానానికి బయలుదేరింది. అయితే రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ మీద నుంచి వెళ్లే సరికి ఒక్క సారిగా కుదుపు ఏర్పడింది. దీంతో వెనకాల ఉన్న గ్లాస్ పగిలిపోయింది. దానికి ఆనుకొని లోపల కూర్చుకున్న పలువురు విద్యార్థుల్లో ఇద్దరు కింద పడిపోయారు. ఇదంతా రోడ్డుపై ఉన్న సీసీ కెమరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జమ్మూకాశ్మీర్ పూంచ్ లో భారీ ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు మృతి.. దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ
ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. గులాబ్ నగర్ ప్రాంతంలో జీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తోంది. అయితే రోడ్డుపై ఉన్న పెద్ద స్పీడ్ బ్రేకర్ పై నుంచి బస్సు వెళ్లగానే ఒక్క సారిగా భారీ కుదుపు ఏర్పడింది. దీంతో వెనుక ఉన్న గ్లాస్ అకస్మాత్తుగా పగిలిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ పరిణామం వల్ల ఇద్దరు విద్యార్థులు కింద పడిపోయారు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
गुजरात: जामनगर ने बस का शीशा टूटने से दो छात्र सड़क पर गिरे।
(वीडियो सोर्स: सीसीटीवी) pic.twitter.com/cL0e5l4HCu
వారిని వెంటనే స్థానికులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బస్సు నిలబడటానికి అంగుళం స్థలం కూడా లేకుండా కిక్కిరిసిపోయింది. అయితే స్పీడ్ బ్రేకర్ దాటే సమయంలో డ్రైవర్ వాహన వేగాన్ని తగ్గించకపోవడతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
ముంబైలో కూడా ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. వసాయి పట్టణంలో కదులుతున్న రైలు నుంచి ఓ వ్యక్తి పడిపోయాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కెమెరాలో రికార్డవగా, కొద్దిసేపటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తీసుకెళ్లారు.