
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ హోటల్ కస్టమర్‌కు ఫుడ్ సర్వ్ చేయడంలో నిర్లక్ష్యం వహించింది. ఆ నిర్లక్ష్యం ఖరీదు రూ. 1 కోటి. వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ ఫుడ్ సర్వ్ చేశారని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి ఆరోపించాడు. నాన్ వెజ్ తినడం తన మతపరమైన సెంటిమెంట్లను గాయపరచడమే కాదు తన ఆరోగ్యానికీ నష్టం చేకూర్చిందని పేర్కొన్నాడు. సదరు హోటల్ తనకు రూ. 1 కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రూ. 1 కోటి లీగల్ నోటీసును పంపించాడు.
ఆగ్రాకు చెందిన అర్పిత్ గుప్తా శాకాహారి. ఫ్రెండ్ సన్నీ గార్గ్‌తో కలిసి ఆగ్రాలోని ఓ లగ్జరీ హోటల్‌కు అర్పిత్ గుప్తా ఏప్రిల్ 14వ తేదీన వెళ్లాడు. ఆ హోటల్‌లో తాను వెజ్ ఫుడ్ ఆర్డర్ చేశాడు. వెజ్ రోల్ ఆర్డర్ చేయగా.. అతనికి చికెన్ రోల్ సర్వ్ చేశారు. ఆ చికెన్ రోల్ తిన్నాక టేస్ట్ వేరుగా ఉన్నదని ఆరా తీశాడు. తాను తిన్నది చికెన్ రోల్ అని అప్పుడు తెలిసింది. ఈ విషయం తెలియగానే వెంటనే వాంతి చేసుకున్నాడని అర్పిత్ గుప్తా న్యాయవాది నరోత్తమ్ సింగ్ తెలిపారు. అర్పిత్ గుప్తా ఆరోగ్యం కూడా క్షీణించిందని వివరించారు.\
ప్రధాని మోడీని కలిసినట్టు కలరింగ్.. మార్ఫింగ్ ఫొటోలతో మోసాలు
ఈ మీల్‌కు ఆ హోటల్ బిల్ కూడా ఇవ్వలేదని, ఈ లోపాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించినట్టు న్యాయవాది నరోత్తమ్ తెలిపారు. అయితే, ఆ ఎపిసోడ్ మొత్తం తన క్లయింట్ మొబైల్‌లో రికార్డ్ చేశాడని వివరించారు. ఆ హోటల్ కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని, దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూ. 1 కోటి పరిహారం అందించాలని ఆ హోటల్‌కు నోటీసులు పంపించారు.