
ఆ దంపతులు తల్లిదండ్రులు అనే పదాలకే మచ్చ తెచ్చారు. కన్న కూతురు అని కూడా చూడకుండా ఓ యువకుడికి 12 ఏళ్ల కూతురిని అమ్మేశారు. అందులో రూ.20 వేలు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. ఈ విషయం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలిసింది. దీంతో వారంతా అక్కడికి వచ్చి బాలికను కాపాడారు. ఈ విక్రయంలో ప్రమేయం ఉన్న 5 గురిని అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.
బక్రీద్ రోజున జంతువులను అక్రమంగా వధించొద్దు - బాంబే హైకోర్టు
బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురిని భోపాల్ లో పోలీసులు అరెస్టు చేశారు. భోపాల్ సమీపంలోని గుణగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలోని 12 ఏళ్ల గిరిజన బాలిక ను ఆమె తల్లిదండ్రులు 27 ఏళ్ల యువకుడికి అమ్మేశారు. అతడు ఆమెను మంగళవారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించున్నాడు. దాని కోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. అయితే ఈ విషయం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలియడంతో వారు పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. ముందుగా పెళ్లిని ఆపి, మరుసటి రోజు (బుధవారం) ఐదుగురిని అరెస్టు చేశారు.
తల్లిదండ్రులు ఆ బాలికను రూ.40 వేలకు విక్రయించి రూ.20 వేలు అడ్వాన్స్ తీసుకున్నారని, మిగిలిన మొత్తాన్ని పెళ్లి తర్వాత ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. విచారణలో బాలిక వయస్సు 12 ఏళ్లు, ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వయసు 27 సంవత్సరాలు అని తేలిందని భోపాల్ రూరల్ ఎస్పీ కిరణ్లతా కెర్కెట్టా చెప్పారు. అయితే బాలికకు ఈ వివాహం ఇష్టం లేదని, ఆమె వద్దని చెబుతున్నా తల్లిదండ్రులు వినిపించుకోలేదని అన్నారు.
యజమాని ఇంట్లోకి పోనివ్వకుండా చిరుతను భయపెట్టిన శునకం.. తోక ముడిచి పరుగులు పెట్టిన పులి..వీడియో వైరల్
ఈ విక్రయంలో ప్రమేయం ఉన్న మైనర్ బాలిక తల్లిదండ్రులు, వరుడు, అతడి తల్లిదండ్రులపై హ్యూమన్ ట్రాఫికింగ్, జువెనైల్ జస్టిస్ యాక్ట్, బాల్య వివాహాల నిరోధక చట్టం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ నిందితులందరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, బ్రోకర్లుగా పనిచేసిన వారు లేదా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారి తెలిపారు.