రోహింగ్యాలకు భారత్ లో స్థిరపడే హక్కు లేదు - సుప్రీంకోర్టుతో కేంద్రం

By Sairam Indur  |  First Published Mar 21, 2024, 8:58 AM IST

రోహింగ్యాలకు భారత్ లో నివసించే హక్కు కల్పించడం తీవ్రమైన భద్రతా సమస్యలతో కూడుకున్నదని కేంద్రం తెలిపింది. అక్రమంగా భారత్ లోకి వచ్చిన వారికి ఇక్కడ నివసించే, స్థిర నివాసం ఏర్పర్చుకునే హక్కు లేదని సుప్రీంకోర్టుతో స్పష్టం చేసింది.


అక్రమ రోహింగ్యా ముస్లిం వలసదారులకు భారత్ లో నివసించే, స్థిరపడే ప్రాథమిక హక్కు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. నిర్బంధంలో ఉన్న రోహింగ్యాలను విడుదల చేయడం సహా ఈ విషయంలో తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రియాలీ సుర్ అనే పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఈ అఫిడవిట్ దాఖలు చేసింది.

ఫోన్ కాల్ లీక్ వివాదం.. ఆర్డీవో పై సీఎస్ కు ఫిర్యాదు చేసిన మంత్రి పొన్నం..

Latest Videos

భారత్ లోకి అక్రమంగా ప్రవేశించే వారిపై చట్టపరంగా, విదేశీయుల చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 1951 శరణార్థుల ఒప్పందం, శరణార్థుల స్థితిగతులకు సంబంధించిన ప్రోటోకాల్ పై భారత్ సంతకం చేయనందున, రోహింగ్యాల సమస్యను సొంత దేశీయ ఫ్రేమ్ వర్క్ ఆధారంగానే నిర్వహిస్తామని అఫిడవిట్లో పేర్కొంది.

ఈ విషయంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారికి శరణార్థి హోదా కల్పించడానికి న్యాయవ్యవస్థ ప్రత్యేక కేటగిరీని సృష్టించజాలదని కేంద్రం పేర్కొంది. కొంతమంది రోహింగ్యా ముస్లింలు శరణార్థుల హోదా పొందడానికి ఉపయోగించిన యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ కార్డులను భారతదేశం గుర్తించడం లేదని నొక్కి చెప్పింది.

ఆశ్చర్యం.. మెదడులో రక్తం కారుతున్నా.. శివరాత్రికి సద్గురు అంత ఉత్సాహంగా ఎలా ఉన్నారు ?

అక్రమ వలసలు, నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలను పొందడం, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాల గురించి ఆందోళనలను కూడా తన సమాధానంలో నొక్కి చెప్పింది. ఇవి దేశ భద్రతకు ముప్పు కలిగిస్తాయని పేర్కొంది. రోహింగ్యాలు భారత్ కు అక్రమంగా వలస రావడం, వారు భారత్ లో ఉండటం పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇది తీవ్రమైన భద్రతా సమస్యలతో కూడుకున్నదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే హోలీ సెలవుల తర్వాత సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను విచారించే అవకాశం ఉంది.

click me!