March 20-Top Ten News : టాప్ టెన్ వార్తలు

By Sairam Indur  |  First Published Mar 20, 2024, 7:22 PM IST

ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు..


తెలంగాణ కొత్త గవర్నర్‌గా సీ.పీ. రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

తమిళిసై సౌందర రాజన్ రాజీనామాతో తెలంగాణకు జార్ఖండ్ గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్ ను గవర్నర్ గా నియమించారు.  తెలంగాణ గవర్నర్ గా  సీ.పీ. రాధాకృష్ణన్  ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి కథనం..

Latest Videos

undefined

తొలిదశ లోక్‌సభ ఎన్నికలు: నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇటీవలనే  ఈసీ  షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే తొలి దశలో భాగంగా నిర్వహించే  ఎన్నికలకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి కథనం..

బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు ఎదురవుతున్నాయి. ఆ పార్టీ నుంచి నేతలు రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. పూర్తి కథనం..

బీజేపీలో చేరిన మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మంగళవారం తన పదవికి ఆమె రాజీనామా చేశారు. ఇవాళ బీజేపీలో ఆమె చేరారు. పూర్తి కథనం..

చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత గుర్తించిన అధికారులు.. 

తిరుమల నడక దారిలో  చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను అధికారులు గుర్తించారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా  అధికారులు  ఈ చిరుతపులిని గుర్తించారు. పూర్తి కథనం..

పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు..

రష్యా అధ్యక్షుడిగా మరో సారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. బుధవారం ఉదయం టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు..

పల్లవి ప్రశాంత్ పై మళ్లీ మొదలైన ట్రోల్స్.. 

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ చేసిన పొలిటికల్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. నెటిజెన్స్ మనోడిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ?  పూర్తి కథనం..

పెళ్లాంని దెయ్యం చేసిన రామ్‌గోపాల్‌ వర్మ.. కొత్త సినిమా ప్రకటన..

సెన్సేషన్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తన నెక్ట్స్ మూవీని ప్రకటించారు. ఓ క్రేజీ టైటిల్‌తో ఆయన మళ్లీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఇదిప్పుడు క్రేజీగా మారింది. పూర్తి కథనం..

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్..

ఐపీఎల్ 2024 సీజ‌న్ లో మార్చి 23న మొహాలీలో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ త‌న తొలి మ్యాచ్ ఆడ‌నుంది. దాదాపు 14 నెల‌ల త‌ర్వాత టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ రిష‌బ్ పంత్ మ‌ళ్లీ ఐపీఎల్ తో గ్రౌండ్ లోకి దిగ‌నున్నాడు. పూర్తి కథనం..

ఏప్రిల్ నుంచి పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు ! ఎందుకో తెలుసా?

1 ఏప్రిల్  2024 నుండి భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర కొంచెం ఎక్కువగా ఉండనుంది. భారత ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ICRA) రెండేళ్ల కాలంలో 10 శాతం వరకు ధరలను పెంచుతుందని అంచనా వేసింది. పూర్తి కథనం..
 

click me!