ఇవేం ఎండలు బాబోయ్.. భానుడి ప్రతాపానికి అహ్మదాబాద్ లో కరిగిన రోడ్డు.. అవస్థలు పడ్డ ప్రయాణికులు..ఫొటోలు వైరల్

Published : Apr 12, 2023, 03:53 PM IST
ఇవేం ఎండలు బాబోయ్.. భానుడి ప్రతాపానికి అహ్మదాబాద్ లో కరిగిన రోడ్డు.. అవస్థలు పడ్డ ప్రయాణికులు..ఫొటోలు వైరల్

సారాంశం

గుజరాత్ లో విచిత్రం జరిగింది. వేసవి తాపానికి అహ్మదాబాద్ లోని ఓ రోడ్డు కరిగింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డంతా జిగటగా మారడంతో పాదాచారుల చెప్పులు కూడా రోడ్డుకు అతుక్కుపోయాయి. 

ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలో భానుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. దేశంలోనే అనేక ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. దీంతో అనేక పరిణామాలు ఎదురవుతున్నాయి. పలువురు వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురవుతున్నారు. మరి కొందరు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే సూరత్, అహ్మదాబాద్ నగరాల్లోని ప్రజలు ఎవరూ ఊహించని వింత పరిస్థితిని ఎదుర్కొన్నారు. 

ప్రధాని మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లేఖ.. మానవతా సాయం చేయాలని అభ్యర్థన..

ఎండ వేడిమి పెరగడంతో అహ్మదాబాద్ లోని ఓ రోడ్డు కరిగిపోయింది. చంద్రశేఖర్ ఆజాద్ వంతెన నుంచి సూరత్ లోని అదాజన్ పాటియా వరకు ఉన్న 200 మీటర్ల రోడ్డుపై కొత్తగా వేసిన బిటుమెన్ కరిగి, చిక్కటి ద్రవంలా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి వాహనాలన్నీ రోడ్డుకు అత్తుకుపోయాయి. మరి కొన్ని చోట్ల టైర్లు జారాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే వారి చెప్పులు కూడా రోడ్డుకు అతుక్కుపోయాయి. 

అహ్మదాబాద్లోని గోమతిపూర్ వార్డులోని 1.5 కిలోమీటర్ల పొడవైన సుద్రం నగర్ రోడ్డులో నెల రోజుల క్రితం వేశారు. దానిపై వేసిన బిటుమెన్, తారు పొర అకస్మాత్తుగా కరిగిపోయింది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) అధికారులు లిక్విడ్ బిటుమెన్ వేసిన తర్వాత ఉపరితలాన్ని ఆరబెట్టడానికి రాతి ధూళి చల్లారు. కానీ మధ్యాహ్నం సమయంలో అది ఇంకా జిగటగా మారింది. అయితే ఈ రోడ్డుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో మళ్లీ సూరత్ మున్సిపల్ కార్పోరేషన్ బృందాలు రోడ్డుపై దుమ్ము చల్లడం ప్రారంభించాయి.

కర్ణాటక ఎన్నికల్లో కీలక పరిణామం.. బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది.. ఎందుకంటే ?

అయితే దీనిపై అధికారులు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ఈ రోడ్డును గుత్తేదారు నాణ్యతా ప్రమాణాల ప్రకారమే వేశారని తెలిపారు. అయితే మరో పొర రాతి ధూళి చల్లిన తర్వాత సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. కాగా.. సోమ, మంగళవారాల్లో అహ్మదాబాద్ లో గరిష్ఠ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యింది. ఈ వారం మొత్తం కూడా ఇంతే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం