
తమిళనాడులోని ఓ జిల్లా కలెక్టర్ వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్ తన కింది స్థాయి ఉద్యోగిని తన బూట్లు తీసుకెళ్లమని కోరడంతో వివాదం చెలరేగింది. తమిళనాడులోని కళ్లకురిచి కలెక్టర్ శ్రావణ్ కుమార్ జాతావత్ ఓ ఆలయంలోకి ప్రవేశించే ముందు తన బూట్లను తీసుకెళ్లమని అసిస్టెంట్‌ని కోరినట్లు చూపిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో చాలా మంది కలెక్టర్ తీరును విమర్శిస్తున్నారు. కానీ, ఆ ఆరోపణను అధికారి పూర్తిగా తిరస్కరించారు. ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు..అధికారి తన బూట్లు తీసివేసి, పాదరక్షలను వేరే చోటికి తీసుకెళ్లమని అతని సహాయకుడిని కోరాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ వివాదం రేపింది. కలెక్టర్ తనవైపు ఎలాంటి తప్పు చేయలేదని ఖండించాడు.
ఈ విషయంపై కలెక్టర్ శరవణ్ కుమార్ జాతావత్ మీడియాతో మాట్లాడుతూ.. తన కింది ఉద్యోగులను తన బూట్లు తీయమని ఎప్పుడూ అడగలేదని నొక్కొ చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'కువగం' ఉత్సవానికి ముందు.. కువాగం కూతాండవర్ ఆలయాన్ని సందర్శించి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చనని తెలిపారు. తన బూట్లను తీసుకెళ్లమని తను అసిస్టెంట్‌కి ఎప్పుడూ సూచించలేదనీ, వాస్తవానికి ఆ వీడియో ఎడిట్ చేయబడిందనీ, తప్పుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ ఆరోపణ నిజం కాదని, ఫీల్డ్‌లో ఉన్న రిపోర్టర్‌లకు ఆ విషయం తెలుసుననీ, ఫీల్డ్‌లో లేని వ్యక్తి ఈ సంఘటనను ఎడిట్ చేసి.. తప్పుగా చూపించారని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయంలో కళ్లకురిచి కలెక్టర్ పై జనం మండిపడుతున్నారు. ఉన్నతమైన పదవిలో ఉండి.. కింది స్థాయి ఉద్యోగులతో బయటనే ఇలా వ్యవహరిస్తే .. కార్యాలయంలో ఇంకెలా వ్యవహరిస్తారో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తోటి ఉద్యోగితో ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు .. గుడి దగ్గర వరకు బూట్లు వేసుకొని వెళ్లడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా మంది అధికారిని విమర్శించారు. ఎంతో కష్టపడి, సివిల్స్ క్రాక్ చేసి.. ఉద్యోగం సంపాదించి.. తోటి ఉద్యోగితో బూట్లు మోపిడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.