FAIMA: నీట్ పీజీ కౌన్సెలింగ్‌ను (NEET-PG 2021) వెంటనే చేపట్టాలంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో రెసిడెంట్ వైద్యులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ ఆస్పత్రి వద్ద మహిళా వైద్యులపై పోలీసులు లాఠిచార్జీ చేయడాన్ని ఖండించిన వైద్యులు.. డిసెంబర్ 29 ఉదయం 8 గంటల నుంచి విధులకు దూరంగా ఉండాలని ఎఫ్ఏఐఎంఏ పిలుపునిచ్చింది.
FAIMA: నీట్ పీజీ కౌన్సెలింగ్‌ను (NEET-PG 2021) వెంటనే చేపట్టాలంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో రెసిడెంట్ వైద్యులు నెల రోజులుగా చేపడుతున్న ఆందోళన ఉద్రిక్తంగా మారాయి. సోమవారం నాడు నిరసన తెలుపుతున్న మహిళా వైద్యులపై పోలీసులు దాడులు చేయడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదైంది. మంగళవారంనాడు కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళుతున్న వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేయడంతో అనేక మంది వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. నిరసన తెలుపుతున్నవారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఆస్పత్రిలోని అన్ని ప్రధాన గేట్లను మూసేశారు. దీంతో లోపలే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. వైద్యులు ఆందోళన కొనసాగించారు.
Also Read: coronavirus: మరో హైదరాబాద్ కరోనా వ్యాక్సిన్ కు అనుమతి.. దేశంలో అందుబాటులో ఉన్న టీకాలివే !
undefined
పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని వైద్యులు ఆరోపించారు. మహిళా వైద్యులనూ పురుష పోలీసులు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నట్టు వెల్లడించారు. పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండించిన వైద్యులు.. ఈ ఘటనకు నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాలని రెసిడెంట్ వైద్యులకు Federation of All India Medical Association (FAIMA) పిలుపునిచ్చింది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి అన్ని రకాల వైద్య సేవలకు దూరంగా ఉండాలని వైద్యులను కోరింది. అలాగే, రెసిడెంట్ వైద్యులతో పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ.. రెసిడెంట్ వైద్యుల సంఘం సమాఖ్య(ఎఫ్‌ఓఆర్‌డీఏ) మంగళవారం నుంచి అన్ని వైద్య సంస్థల్లో విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(ఎఫ్‌ఏఐఎంఏ) బుధవారం ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో దేశ రాజధానిలోని పలు ఆస్పత్రుల్లో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read: Work From Home: ఒమిక్రాన్ దెబ్బ.. ఈ కంపెనీల్లో శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం !
ఇదిలావుండగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రెసిడెంట్ వైద్యులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, వైద్యులను నిర్బంధించడాన్ని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్‌వోఆర్‌డీఏ) తీవ్రంగా ఖండించింది. ఘటన జరిగిన రోజు మంగళవారాన్ని ‘బ్లాక్ డే’గా పేర్కొంది.నీట్ పీజీ 2021 ప్రవేశాల విషయంలో జాప్యంపై నెల రోజులుగా నిరసన తెలుపుతున్న పలువురు వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల నిర్బంధాన్ని నిరసిస్తూ ఆస్పత్రుల తాత్కాలిక మూసివేతకు సోమవారమే ఎఫ్‌వోఆర్‌డీఏ పిలుపునిచ్చింది. పోలీసులు తమతో దారుణంగా ప్రవర్తించారనీ, తమపై దాడి చేశారని నిరసనలో పాల్గొన్న పలువురు మహిళా వైద్యులు ఆరోపించారు. ఇక తామ నిరసన గొంతుకను ఎంతలా వినిపించినా తమ గోడును పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'చివరి ప్రయత్నంగా ఈ నిరసన తెలుపుతున్నాం. కానీ, ప్రభుత్వం వినడం లేదు. మేం ఏం చేయాలి?' అని ఓ రెసిడెంట్ వైద్యుడు మీడియాతో చెప్పారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని వైద్యులు పేర్కొంటున్నారు.
Also Read: Mukesh Ambani: వారసుల చేతుల్లోకి రిలయన్స్.. ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు !