అర్ధరాత్రి కుదిరిన సయోధ్య.. గెహ్లాట్, పైలట్ మధ్య విభేదాలు తొలగించిన కాంగ్రెస్.. బీజేపీని ఎదిరిస్తామని ప్రతిజ్ఞ

By Asianet NewsFirst Published May 30, 2023, 11:06 AM IST
Highlights

రాజస్థాన్ కాంగ్రెస్ నాయకులైన అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య సోమవారం అర్ధరాత్రి సయోధ్య కుదిరింది. పార్టీ హైకమాండ్ సమక్షంలో వారిద్దరూ రాజీ పడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదిరించడానికి కలిసి పని చేస్తామని చెప్పారు. 

రాజస్థాన్ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన అనుచరుడు సచిన్ పైలట్ మధ్య నెలకొన్న విభేదాలను చల్లార్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఢిల్లీలో ఇరువురు నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం సోమవారం అర్ధరాత్రి వరకు సాగాయి. అర్థరాత్రి సమయంలోనే కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కొంటామని ప్రతిజ్ఞ చేశారు.

కళ్ల ముందే కడతేరుస్తున్నా అడ్డుకోని జనం.. బాలికను చంపిన కొన్ని సెకన్లకే ఫోన్ ఆఫ్ చేసి, బస్సులో వెళ్లిన సాహిల్

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడేందుకు పైలట్, గెహ్లాట్ అంగీకరించారని తెలిపారు. ‘‘రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, ఇంచార్జీలతో నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఐక్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించాం. రాజస్థాన్ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాం. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరూ ఈ ప్రతిపాదనతో ఏకగ్రీవంగా ఏకీభవించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేస్తామని, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ నే గెలిపిస్తామని చెప్పారు.’’ అని అన్నారు. నాయకత్వ నిర్ణయాన్ని ఇరువురు నేతలు పార్టీ అధిష్టానానికే వదిలేశారని కేసీ వేణుగోపాల్ తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి

వసుంధర రాజే నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా విచారణ జరపాలని, ఈ దిశలో చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పై సచిన్ పైలట్ గత కొంత కాలంగా విరుచుకుపడుతున్నారు. దీంతో సొంత పార్టీలో కీలక నాయకుల మధ్య విబేధాలు ఉన్నాయని స్పష్టంగా వెల్లడైంది. చాలా కాలం నుంచి ఇరువురు నేతలు కలుసుకోవడమే మానేశారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ నాయకత్వం సమక్షంలో పైలట్, గెహ్లాట్ ముఖాముఖి అయ్యారు. గతసారి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, ఢిల్లీలో జరిగిన మరో ప్రెస్ మీట్ లో వీరిద్దరూ కలిసి వేదికను పంచుకున్నారు.

ఎలక్ట్రిక్ పోల్ నిలబెడుతుండగా కరెంట్ షాక్.. ఎనిమిది మంది కూలీలు మృతి

ఈ నెలాఖరులోగా తన మూడు డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని పైలట్ ఇటీవల చెప్పారు. గెహ్లాట్ ప్రభుత్వానికి పైలట్ అల్టిమేటం ఇవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు నేతలతో సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. కాగా.. రాష్ట్రంలో నాయకత్వ మార్పును డిమాండ్ చేస్తూ 2020 జూలై నుంచి సచిన్ పైలట్ మొదలుపెట్టిన తిరుగుబాటు వల్ల రాజస్థాన్ కాంగ్రెస్ గణనీయమైన ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే పైలెట్ తిరుగుబాటు ఆయనను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పించారు. అప్పటి నుంచి పార్టీ రాష్ట్ర శాఖలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, గత ఏడాది సెప్టెంబర్ లో పార్టీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా సంక్షోభం మరింత ముదిరిందని తేటతెల్లమైంది.
 

click me!