Ravan: ఈ రోజైనా రావణుడి గురించి అడగకండి.. : రాహుల్ గాంధీపై హిమంత ఫైర్

By Mahesh K  |  First Published Jan 22, 2024, 9:03 PM IST

రాహుల్ గాంధీని రావణుడితో పోల్చుతూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఫైర్ అయ్యారు. ఈ ఒక్క రోజైనా రావణుడి గురించి మాట్లాడనివ్వకండి అంటూ కామెంట్ చేశారు. రాహుల్ గాంధీని ఎందుకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించలేదనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ కామెంట్ చేశారు.
 


Rahul Gandhi: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గురించి ప్రశ్న వేయగా.. ఈ రోజైనా రావణుడి గురించి మాట్లాడనివ్వకండి అంటూ కామెంట్ చేశారు. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ నేతలను ఆయన రావణుడితో పోల్చారు. ముఖ్యంగా రాహుల్ గాంధీని ఆయన రావణుడితో పోల్చుతూ మాట్లాడారు.

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాహుల్ గాంధీని ఎందుకు ఆహ్వానించలేదని ఓ రిపోర్టర్ హిమంత బిశ్వ శర్మను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజైనా రావణుడి గురించి మాట్లాడనివ్వకండి అని అన్నారు. ‘మీరు రావణుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?’ అని అన్నారు. ‘ఈ ఒక్క రోజైనా రాముడి గురించి మాట్లాడండి. 500 ఏళ్ల తర్వాత ఇవాళ్ల అయినా రాముడి గురించి మంచి మాట్లాడాలి. ఈ ఒక్క రోజైనా మమ్మల్ని రావణుడి గురించి మాట్లాడనివ్వకండి’ అని పేర్కొన్నారు.

Latest Videos

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానాలు అందాయి. రాహుల్ గాంధీని ఆహ్వానించలేదు. అయితే ,ఆహ్వానాలు అందిన ఆ కాంగ్రెస్ నేతలు కూడా అయోధ్యకు రావడానికి నిరాకరించారు.

Also Read : రామ మందిరం ప్రారంభం రోజే జన్మించిన బాలుడికి రామ్ రహీం పేరు పెట్టిన ముస్లిం మహిళ

అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫంక్షన్‌గా మలుస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వహించే కార్యక్రమంగా ఉన్నదని కాంగ్రెస్ ఫైర్ అయింది. అందుకే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావడం లేదని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ అయితే.. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ‘నరేంద్ర మోడీ ఫంక్షన్‌’గా వర్ణించారు. కాంగ్రెస్ ఈ ఫంక్షన్‌ కు వెళ్లబోదని రాహుల్ గాంధీ ముందుగానే స్పష్టం చేశారు.

click me!