రామ మందిరం ప్రారంభం రోజే జన్మించిన బాలుడికి రామ్ రహీం పేరు పెట్టిన ముస్లిం మహిళ

By Mahesh KFirst Published Jan 22, 2024, 8:47 PM IST
Highlights

రామ మందిరం ప్రారంభం రోజే యూపీలో ఓ ముస్లి మహిళ బాలుడికి జన్మనిచ్చింది. ఆ బాలుడి పేరును రామ్ రహీమ్ అని ఆ కుటుంబం పెట్టుకుంది.
 

Ayodhya: జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడు కొలువైన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. దేశమంతా జనవరి 22వ తేదీన పవిత్రమైన రోజుగా భావించారు. ఇదే రోజున ఓ ముస్లిం మహిళకు బాలుడు పుట్టాడు. ఆ బాలుడి పేరును రామ్ రహీమ్ అని పెట్టారు. దేశంలో ముస్లిం, హిందువుల ఐక్యతకు చిహ్నంగా ఈ పేరును ఆమె పెట్టడం గమనార్హం.

అయోధ్య నగరం ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ బాలుడు పుట్టాడు. ఫిరోజాబాద్‌లో ఓ ముస్లిం మహిళ ప్రసవించింది. పండంటి కొడుకు పుట్టాడు. బాలుడి అవ్వ హుస్ను బాను మంచి పేరు సెలెక్ట్ చేసింది. పుట్టిన రోజే బాబుకు రామ్ రహీమ్ అని పెట్టింది. బాబు, తల్లి ఇద్దరి ఆరోగ్యం బాగున్నదని ఫిరోజాబాద్ జిల్లా విమెన్ హాస్పిటల్ ఇంచార్జీ డాక్టర్ నవీన్ జైన్ తెలిపారు. 

Latest Videos

బాబ్రీ మసీదు కూల్చేసిన చోటే రామ మందిరాన్ని నిర్మించడం, ఆ మందిరంలో ఈ రోజు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడానికి పాకిస్తాన్ దేశం ఖండించింది. బాబ్రీ మసీదు తరహాలోనే ధ్వంసం చేయడానికి మరికొన్ని మసీదులు జాబితాలో ఉన్నాయని ఆరోపించింది. దేశంలోని ముస్లిం మైనార్టీలకు భద్రత కల్పించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

Also Read : Lord Rama: మేం గాంధీ రాముడిని కొలుస్తాం.. బీజేపీ రాముడిని కాదు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

కాగా, ఇదే దేశంలోని ఓ ముస్లిం కుటుంబం మాత్రం అప్పుడే పుట్టిన బిడ్డకు హిందూ ముస్లింల మధ్య మత సామరస్యానికి ప్రతీకగా పేరు పెట్టింది.

click me!