అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్ణీత ముహుర్త సమాయానికి పూర్తైంది.
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ మందిరంలో అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. అనంతరం రామ్ లల్లా విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
ఇవాళ మధ్యాహ్నం 12:29 గంటలకు 84 సెకన్ల పాటు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తైంది. ప్రాణ ప్రతిష్ట ప్రధాన పూజ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.ఆలయానికి వచ్చే సమయంలో తన చేతిలో బాలరాముడికి పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదుకలను మోడీ తీసుకు వచ్చారు. పూజలో పాల్గొన్న సమయంలో మోడీ వాటిని స్వామివారికి సమర్పించారు.
వారం రోజుల పాటు స్వామి వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికిసంబంధించిన పూజలు ప్రారంభమయ్యాయి.ఈ పూజ కార్యక్రమాలకు డాక్టర్ అనిల్ మిశ్రా ప్రధాన కర్తగా వ్యవహరించారు. ఇవాళ జరిగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రధాన ముఖ్య కర్తగా వ్యవహరించారు.ఈ ప్రధాన పూజ కార్యక్రమంలో 14 జంటలు కూడ పాల్గొన్నాయి.
వారం రోజుల నుండి రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక పూజ కార్యక్రమాలకు సంబంధించి డాక్టర్ అనిల్ మిశ్రా ప్రధాన కర్తగా వ్యవహరించారు. ప్రాణ ప్రతిష్టలో భాగంగా చివరి రోజున నిర్వహించిన ప్రధాన పూజలో మోడీ ప్రధాన కర్తగా పాల్గొన్నారు.
also read:అయోధ్య రామ మందిరం:రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న మోడీ
ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ప్రధాన పూజా కార్యక్రమం పూర్తైన తర్వాత రామ్ లల్లా విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని పలు మీడియా సంస్థలు, డిజిటల్ సంస్థలు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి భక్తులు ఆసక్తిగా ఎదురు చూశారు.
స్వర్ణాభరణాలతో బాలరాముడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో రాముడు భక్తులకు దర్శనమిచ్చాడు.అయోధ్యలో ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమైంది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి దర్శనంతో భారతావని పులకరించింది.వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా ప్రాణ ప్రతిష్ట జరిగింది
బాలరాముడికి తొలి హరతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చారు. బాలరాముడికి పూజలు ముగిసిన తర్వాత మోడీ సాష్టాంగ ప్రమాణం చేశారు.ప్రాణ ప్రతిష్టలో ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, తదితరులు పాల్గొన్నారు.