అయోధ్య రామ మందిరం:రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న మోడీ

By narsimha lode  |  First Published Jan 22, 2024, 12:25 PM IST


అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని  రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ట ప్రధాన ఘట్టంలో మోడీ పాల్గొన్నారు.


న్యూఢిల్లీ:అయోధ్యలోని రామ మందిరంలోని రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ట ప్రధాన పూజలు సోమవారం నాడు నిర్వహించారు. 

ఇవాళ మధ్యాహ్నం  నిర్ధేశించిన సమయానికి మోడీ  గర్భగుడిలోకి ప్రవేశించారు. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్టకు చెందిన ప్రధాన పూజలలో పాల్గొన్నారు.ఆలయానికి  వచ్చే సమయంలో తన చేతిలో బాలరాముడికి పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదుకలను మోడీ తీసుకు వచ్చారు.

Latest Videos

undefined

రామ్ లల్లా విగ్రహాం ప్రాణ ప్రతిష్టకు సంబంధించి వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు  వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించారు.  ఈ వారం రోజుల పాటు  ప్రాణ ప్రతిష్ట పూజలకు  అనిల్ మిశ్రా కర్తగా వ్యవహరించారు. ఇవాళ ప్రాణ ప్రతిష్ట ఘట్టానికి  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రధాన యజమాన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో  14 జంటలు కూడ  పూజలో పాల్గొంటున్నాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు   దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు వేల మందికి ఆహ్వానాలు పంపింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.  ఇందులో రాజకీయ, సినీ, వ్యాపార,  క్రీడా ప్రముఖులున్నారు.  రేపటి నుండి సాధారణ భక్తులకు అయోధ్యలో రాముడి దర్శనం కోసం  అనుమతిని ఇవ్వనున్నారు.

click me!