
అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠతో రామరాజ్యం ప్రారంభమవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఇక దేశంలోని అసమానతలన్నీ తొలగిపోతాయని చెప్పారు. ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడారు.
అయోధ్యకు మన తెలుగు రాష్ట్రాల కానుకలు.. ఏం పంపించామంటే ?
‘‘ప్రాణ ప్రతిష్ఠతో నేటి నుంచి రామరాజ్యం ప్రారంభమవుతుంది. అసమానతలన్నీ సమసిపోతాయి. అందరూ ప్రేమగా ప్రవర్తిస్తారు. అయోధ్య నుంచి దేశం మొత్తానికి వచ్చే మార్పు ఎంతో అందంగా ఉంటుంది. అందరూ సామరస్యంగా జీవిస్తారు. సద్భావనతో బతుకుతాం. రాముడి ఆశీస్సులు అందరిపై ఉంటాయి.’’ అని అన్నారు.
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట.. 84 సెకన్ల పాటు 'మూల ముహూర్తం'
అంతా చాలా బాగా జరుగుతోందని, రామ భక్తులు కోరుకున్నది నేడు నెరవేరుతోందని చెప్పారు. రామ్ లల్లా కూర్చోగానే... కష్టాలన్నీ తీరిపోతాయని సత్యేంద్ర దాస్ తెలిపారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ సోమవారం అయోధ్యలోని రామాలయంలో చరిత్ర సృష్టించనుందని తెలిపారు. జనవరి 22, పౌష్ శుక్లా కూర్మ ద్వాదశి, విక్రమ్ సంవత్ 2080, రామ్ లల్లా అయోధ్యలో కొలువు దీరనున్నారని చెప్పారు.
అయోధ్య రామ మందిరం:రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న మోడీ
ఇదిలా ఉండగా.. ఆలయ ప్రాణప్రతిష్ట అనంతరం భక్తులందరూ అయోధ్యను సందర్శింవచ్చని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. జనవరి 27 తర్వాత ఆలయ సందర్శనలను ప్లాన్ చేసుకోవాలని ప్రజలను కోరింది. అయితే ట్రస్ట్ భక్తులు రాకూడదని అభ్యర్థించినప్పటికీ సరిహద్దులను మూసివేసే సమయానికి ముందే పెద్ద సంఖ్యలో భక్తులు నగరానికి చేరుకున్నారు.