మళ్లీ మోగిన ఎన్నికల నగారా.. కేరళ, బెంగాల్ రాజ్యసభ సీట్లకు ఉపఎన్నికలు

By telugu teamFirst Published Oct 31, 2021, 4:40 PM IST
Highlights

అసెంబ్లీ ఉపఎన్నికలు ముగియగానే మరోసారి ఎన్నికల నగారా మోగింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాజ్యసభ స్థానాలకు నవంబర్ 29న ఉపఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరగనుంది.
 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో అసెంబ్లీ ఉపఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అటు ముగియగానే ఇటు మరోసారి ఉపఎన్నికల నగారా మోగింది. Kerala, West Bengalలో ఖాళీగా ఉన్న రెండు Rajya Sabha సీట్లకు By Elections నిర్వహించడానికి Election Commission నిర్ణయం తీసుకుంది. నవంబర్ 29న ఈ Bypolls జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి పోలింగ్ ముగిసిన ఒక గంట తర్వాత Counting మొదలుకానుంది. 

Keralaలో రాజ్యసభ ఎంపీ కాంగ్రెస్(ఎం) నేత జోస్ కే మణి ఈ ఏడాది జనవరి 11న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన పదవీకాలం జులై 2024వరకు ఉన్నది. కాగా, పశ్చిమ బెంగాల్‌లో సెప్టెంబర్ 15న టీఎంసీ ఎంసీ ఎంపీ అర్పితా ఘోష్ పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం ఏప్రిల్ 2026 వరకు ఉన్నది.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా కేరళ రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించడంపై ఈసీ సుముఖత తెలుపలేదు. కానీ, ప్రస్తుతం కొంత మెరుగుపడ్డ పరిస్థితుల్లో ఎన్నికల సంఘం మరోసారి సమీక్ష నిర్వహించింది. కేరళలోని పరిస్థితులను అన్ని కోణాల్లో ఈసీ సమీక్షించిందని, ఆ తర్వాతే పశ్చిమ బెంగాల్, కేరళ రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టు ఈసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Also Read: 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు నేడే ఉప ఎన్నిక.., బీజేపీ VS కాంగ్రెస్‌లుగా సాగనున్న పోరు..

నవంబర్ 9న ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు గడువు చివరి తేదీ నవంబర్ 16గా నిర్ణయించింది. నవంబర్ 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుంది. అదే రోజు పోలింగ్ ముగిసిన గంట తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.

శనివారమే 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా & నగర్ హవేలీలో కలిసి మొత్తం మూడు లోక్‌సభ,  29 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరిన తర్వాత దాదాపు అన్ని అసెంబ్లీ Bypolls జరిగాయి.. ఈ ఎన్నికకు సంబంధించి మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది.

హిమాచల్ ప్రదేశ్ (మండి), మధ్యప్రదేశ్ (ఖాండ్వా) దాద్రా & నగర్ హవేలీలలో మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఎంపీల మరణంతో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. మండి ఎంపీ రాంస్వరూప్ శర్మ, ఖాండ్వా ఎంపీ నంద్ కుమార్ సింగ్ చౌహాన్ మార్చ్ లో మరణించగా, దాద్రా ఎంపీ మోహన్ డెల్కర్ ఒక నెల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. మండి,  ఖాండ్వాలు BJP చేతిలో ఉండగా, డెల్కర్ స్వతంత్ర MPగా ఉన్నారు.

Also Read: huzurabad bypoll: వీవీ ప్యాట్‌ల తారుమారుపై దుమారం .. వివరణ కోరిన తెలంగాణ సీఈవో

బెంగాల్‌లో నాలుగు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి, వీటిలో ఒకటి కూచ్ బెహార్‌కు చెందిన దిన్‌హటాకు, ఇక్కడ ఏప్రిల్-మేలో బిజెపి చేతిలో అధికార తృణమూల్‌కు చెందిన ఉదయన్ గుహా (57 ఓట్ల తేడాతో) ఓడిపోయారు. బిజెపికి చెందిన నిసిత్ ప్రమాణిక్, జూనియర్ హోం మంత్రి, తన లోక్‌సభ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి రాజీనామా చేసిన తర్వాత అతనికి రెండవ అవకాశం లభించింది. రాష్ట్ర ఎన్నికల కోసం ముసాయిదా చేసిన పలువురు బీజేపీ ఎంపీలలో ప్రమాణిక్ ఒకరు. తెలంగాణలో హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో బద్వేల్‌ స్థానాలకు అసెంబ్లీ ఉపఎన్నికలు జరిగాయి.

click me!