విదేశాల​ నుంచి రాగానే వ్యాక్సినేషన్​పై ప్రధాని మోదీ కీలక సమీక్ష.. ఆ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడనున్న మోదీ..

By team teluguFirst Published Oct 31, 2021, 4:12 PM IST
Highlights

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రదాన  మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi).. భారత్‌కు తిరిగి వచ్చాక కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కీలక సమీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ తక్కువగా జరిగిన జిల్లాల (low vaccine coverage) అధికారులతో ప్రధాని మోదీ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రదాన  మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi).. భారత్‌కు తిరిగి వచ్చాక కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కీలక సమీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ తక్కువగా జరిగిన జిల్లాల (low vaccine coverage) అధికారులతో ప్రధాని మోదీ వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఈరోజు ప్రకటన చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ 50 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లా, రెండో డోస్ తక్కువగా ఉన్న జిల్లాల అధికారులతో మోదీ సమీక్ష చేపట్టనున్నారు. అయితే భారత్‌ గత వారం కోవిడ్ వ్యాక్సినేషన్ (Covid Vaccination)  పంపిణీ 100 కోట్ల డోసుల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ ఘనతను దేశ సామర్థ్యానికి, నవ భారతదేశానికి చిహ్నంగా మోదీ కొనియాడారు.

‘జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయలతో సహా ఇతర రాష్ట్రాల్లో టీకా పంపిణీ తక్కువగా ఉన్న మొత్తం 40 జిల్లాలో కలెక్టర్లత మోదీ మాట్లాడతారు. ఈ సమీక్షలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వర్చువల్‌గా పాల్గొంటారు’అని ప్రధాని కార్యాలయం తెలిపింది. విదేశీ పర్యటన ముగించుకుని వెంటనే మోదీ ఈ సమీక్ష నిర్వహించనున్నారు. నవంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష జరగనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దేశంలో మూడొంతుల మంది వయసు పైబడినవారు వ్యాక్సిన్ తొలి డోసు తీసుకన్నారు. 30 శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నారు. 

Also Read: రోమ్ నగరం చేరుకున్న ప్రధాని మోదీ.. జీ 20 సదస్సు, పోప్ ఫ్రాన్సిన్‌తో భేటీ.. ఆ తర్వాత బ్రిటన్‌కు..


జీ-20 సమావేశాల కోసం మోదీ రోమ్ నగరానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పోప్ ప్రాన్సిస్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇండియాకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయ ఆలింనగం చేసుకున్నారు. శనివారం రోమ్‌లో జరిగిన G20 సమ్మిట్‌లో ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశం ఒక బిలియన్ డోస్‌లను అందించిందని, మహమ్మారిపై పోరాటంలో ప్రపంచానికి సహాయం చేయడానికి వచ్చే ఏడాది చివరి నాటికి 5 బిలియన్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉందని ప్రధాన మంత్రి వెల్లడించారు. 

Also read: రాష్ట్రీయ ఏక్తా దివస్.. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహాం వద్ద పటేల్‌కు అమిత్ షా నివాళి..

అనంతరం మోదీ యూకే బయలుదేరి వెళ్తారు. నవంబర్ 1న గ్లాస్గోలో జరిగే కాప్ 26 సమావేశంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో బ్రిటన్ ప్రధాని బోరిస్‌తో మోదీ భేటీ కానున్నారు. అనంతరం నవంబర్ 3వ తేదీన మోదీ తిరిగి భారత్‌కు చేరుకోనున్నారు. 

click me!