రైతుల జోలికొస్తే.. గవర్నమెంట్ ఆఫీసులన్నీ మార్కెట్లుగా మారుస్తాం: ప్రభుత్వానికి రాకేశ్ టికాయత్ హెచ్చరిక

By Siva KodatiFirst Published Oct 31, 2021, 3:21 PM IST
Highlights

వ్యవసాయ చట్టాలపై నిరసనగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను తొలగించే ప్రయత్నం చేయొద్దని భారతీయ కిసాన్‌ (bharatiya kisan union) యూనియన్‌ చీఫ్‌ రాకేశ్‌ టికాయత్‌ (rakesh tikait) ప్రభుత్వాన్ని కోరారు. బలవంతంగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ధాన్య సేకరణ మార్కెట్లుగా మారుస్తామని రాకేశ్ హెచ్చరించారు.

వ్యవసాయ చట్టాలపై నిరసనగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను తొలగించే ప్రయత్నం చేయొద్దని భారతీయ కిసాన్‌ (bharatiya kisan union) యూనియన్‌ చీఫ్‌ రాకేశ్‌ టికాయత్‌ (rakesh tikait) ప్రభుత్వాన్ని కోరారు. బలవంతంగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ధాన్య సేకరణ మార్కెట్లుగా మారుస్తామని రాకేశ్ హెచ్చరించారు. సింఘు, టిక్రీ, గాజీపుర్‌లలో వేల మంది రైతులు గత ఏడాది నవంబరు 26 నుంచి కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన శిబిరాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే.

కాగా.. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సరిహద్దుల్లోని రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లను (barricades) తొలగిస్తున్నారు పోలీసులు. మేకులు కొట్టిన భారీ కాంక్రీట్ బ్లాక్స్‌ని బుల్డొజర్లతో పక్కకు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను (farm laws) వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతులను ఢిల్లీ సరిహద్దుల వద్దే అడ్డుకున్నారు పోలీసులు. రైతుల వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా టిక్రీ, ఘజీపూర్ సరిహద్దుల వద్ద భారీ స్థాయిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో రైతులు సరిహద్దుల్లోనే టెంట్లు వేసుకుని వుంటూ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. 

ALso Read:రైతులపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం.. రంగంలోకి పోలీసులు, ఢిల్లీ బోర్డర్‌లో బారికేడ్ల తొలగింపు

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల శిబిరాల వల్ల ఆయా మార్గాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసించే వారితో పాటు అటు తరచుగా ప్రయాణించే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతుల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి.. రోడ్లను తెరవాలంటూ సుప్రీంకోర్ట్‌ను (supreme court) ఆశ్రయించారు. దీంతో రైతులకు నిరసన తెలిపే హక్కు వున్నా.. నిరవధికంగా రోడ్లను నిర్బంధించడానికి వీల్లేదని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. అయితే తాము రోడ్లపై ఎలాంటి అడ్డంకులు కల్పించలేదని .. ఆ పని చేస్తోందని పోలీసులని కోర్టుకు తెలిపారు రైతులు (farmers) . 

సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు హర్యానా-ఢిల్లీల మధ్య గల టిక్రీ సరిహద్దు (tikri border) , అలాగే యూపీ - ఢిల్లీ సరిహద్దు ఘాజీపూర్‌ల (ghazipur border) వద్ద గల బారీకేడ్లను తొలగించే పని ప్రారంభించారు అధికారులు. నిన్న రైతుల ప్రతినిధుల బృందంతో కలిసి సరిహద్దుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసిన ప్రాంతాలను పరిశీలించారు  పోలీసులు. అనంతరం రాత్రి నుంచి బారికేడ్లను తొలగించే  పని మొదలుపెట్టారు. 

click me!