
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దోషిగా తేలారు. దీంతో ఆయన లోక్ సభ ఎంపీగా అనర్హతకు గురయ్యారు. ఈ పరిణామాలు చోటు చేసుకున్న తరువాత తొలిసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సహనం కోల్పోయారు. జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా చదువు కోసం దాచిన డబ్బును కొడుకు పెళ్లికి ఖర్చు పెట్టారు.. తల్లిదండ్రులపై కూతురి న్యాయపరమైన చర్యలు
‘‘కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మీరు ఓబీసీలను అగౌరవపరిచారని బీజేపీ ఆరోపిస్తోందని, అందుకే మీరు దేశ వ్యాప్తంగా మీడియా సమావేశం పెట్టాలని భావిస్తున్నారని, దీనిపై మీరేమంటారు?’’ అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ స్పందిస్తూ కోపంగా.. ‘‘భయ్యా దేఖియే.. పెహ్లా ఆప్కా అటెంప్ట్ వహన్ సే ఆయా, దుస్రా ఆప్కా అటెంప్ట్ యహన్ సే ఆయయా, తీస్రా ఆప్కా అటెంప్ట్ యహన్ సే ఆయా. ఆప్ ఇత్నే డైరెక్ట్ లీ బీజేపీ కే లియే క్యు కామ్ కర్ రహే హో? (అన్నా చూడండి.. మొదట మీరు నన్ను అక్కడి నుండి (దిక్కు) ప్రశ్న అడగడానికి ప్రయత్నించారు, రెండో సారి ఇక్కడి నుంచి, మళ్లీ మూడో సారి ఇక్కడి నుంచే.. మీరు నేరుగా బీజేపీ కోసం ఎందుకు పని చేస్తున్నారు. ?) తోడి డిస్క్రేషన్ సే కరో యాడ్ (కొంచెం విచక్షణతో చేయండి). ’’ అని అన్నారు.
మళ్లీ కొంచెం సేపు ఆగి ‘‘దయచేసి మీరు బీజేపీ కోసం పని చేయాలనుకుంటే ఇక్కడ (చాతీ వైపు చేయి చూపిస్తూ) బీజేపీ జెండా గుర్తు తెచ్చి మీ ఛాతీపై పెట్టుకోండి.. అప్పుడు నేను వారికి ఎలా సమాధానం ఇస్తానో అదే విధంగా సమాధానం ఇస్తాను. కానీ ప్రెస్‌మెన్‌గా నటించండి.’’ అని ప్రశ్నించిన జర్నలిస్టును చూసి అన్నారు. కొన్ని సెకెండ్లు ఆగి నవ్వుతూ ‘‘హవా నికాల్ ది?’’ (గాలి వెళ్లిపోయిందా ?) అని అన్నారు. దీంతో అక్కడున్న మిగితా మీడియా ప్రతినిధులు కూడా నవ్వారు.
ఈ సమావేశం సందర్భంగా రాహుల్ గాంధీ అనేక విషయాలపై మాట్లాడారు. భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, దానిని నిరూపించేందుకు అనేక ఉదాహరణలు ఎప్పటికప్పడు వస్తూనే ఉన్నాయని అన్నారు. నేను విదేశీ జోక్యం కోరానని మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని, కానీ తాను అలా అనలేదని అన్నారు. తాను అదానీ సమస్యపై ప్రశ్నలు అడుగుతూనే ఉంటానని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. తనను అనర్హులుగా ప్రకటించడం ద్వారానో లేక జైలులో ఉంచడం ద్వారానా నన్ను వారు (బీజేపీ) భయపెట్టలేరని అన్నారు.
భారత ప్రజల ప్రజాస్వామిక స్వరాన్ని కాపాడుతూనే ఉంటానని ఆయన అన్నారు. గౌతమ్ అదానీ డొల్ల కంపెనీలకు వెళ్లిన రూ.20 వేల కోట్లు ఎవరివి అనే సాధారణ ప్రశ్న నుంచి ప్రధాని నరేంద్ర మోడీని రక్షించేందుకు చేసిన డ్రామా ఇదంతా అని తెలిపారు. అనర్హతలకు, జైలు శిక్షలకు తాను భయపడనని చెప్పారు.