నా చదువు కోసం దాచిన డబ్బును కొడుకు పెళ్లికి ఖర్చు పెట్టారు.. తల్లిదండ్రులపై కూతురి న్యాయపరమైన చర్యలు

By Mahesh KFirst Published Mar 25, 2023, 3:12 PM IST
Highlights

తన చదువు కోసం దాచిన డబ్బును కొడుకు పెళ్లిని ఘనంగా చేయడానికి ఖర్చు పెట్టారని ఓ కూతురు మండిపడింది. తల్లిదండ్రులను నిలదీసి చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయాన్ని ఆమె రెడ్డిట్‌లో పోస్టు చేశారు.
 

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతున్నది. తన చదువు కోసం దాచిన డబ్బును కొడుకు పెళ్లి వైభవంగా జరపడానికి ఖర్చు పెట్టారని ఓ యువతి తల్లిదండ్రులపై ఆరోపణలు చేసింది. తనకు దక్కాల్సిన డబ్బును పొందడానికి ఆమె తల్లిదండ్రులపైనే న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది. రెడ్డిట్‌లో పోస్టు చేసిన ఈ అంశం వైరల్ అయింది.

ఓ యువతి రెడ్డిట్ ప్లాట్‌ఫామ్‌లో ఇలా పోస్టు చేసింది. తమ గ్రేట్ ఆంట్ కుటుంబంలోని ఆడపిల్లలందరి చదువుల కోసం డబ్బు దాచిందని వివరించింది. ఆమె ఓ బ్రిటీష్ వ్యక్తిని పెళ్లి చేసుకుందని పేర్కొంది. మంచి జీవితాన్ని జీవించిన తర్వాత తన మేనకోడళ్లు.. గ్రాండ్ నీసెస్‌లు అందరికీ చదువు అందాలని భావించిందని తెలిపింది. తాను ఉన్నన్ని రోజులు ఖర్చు పెట్టిందని, తన తదనంతరం కూడా కుటుంబంలోని ఆడపిల్లలకు డబ్బు చెందాలని ఫండ్ ఏర్పాటు చేసిందని వివరించింది.

అయితే, ఆ ఫండ్‌ను తన తల్లిదండ్రులు యాక్సెస్ చేశారని, ఆ డబ్బును కొడుకు పెళ్లి వైభవంగా చేయడానికి ఖర్చు పెట్టారని ఆమె ఆరోపించింది. 

‘నేను నా తల్లిదండ్రులను ఆ డబ్బుల కోసం అడిగాను. తమకు అవసరం పడి తీసుకున్నామని వారు చెప్పారు. కానీ, ఆ డబ్బు ఎక్కడికి పోయిందో? ఎందుకు ఖర్చు పెట్టారో కూడా నాకు తెలిసింది. వారి మీద మండిపడ్డాను. నేను స్టూడెంట్ లోన్లు తీసుకుని బయటకు వెళ్లాను’ అని వివరించింది. ఇలా చేయడాన్ని వారు అవమానంగా భావిస్తున్నారని తెలిపింది. ‘నాకు దక్కాల్సిన డబ్బు కోసం నేను నా తల్లిదండ్రులను నిలదీస్తున్నాను. నా తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటున్నాను. ఇంటి విషయాలను బయట పెట్టానని వారు బాధపడుతున్నారు’ అని పేర్కొంది.

Also Read: మోదీ, అదానీల మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను.. ఆ భయం ప్రధాని కళ్లలో చూశాను: రాహుల్

కాగా, ఆమె పోస్టుకు నెటిజన్లు మద్దతు పలికారు. న్యాయంగా ఆమెకు దక్కాల్సిన డబ్బు కోసం ఆమె పోరాడుతున్నదని వివరించారు. ఆమెకు దక్కాల్సిన సొమ్ము దక్కాలని కోరుకుంటున్నట్టు కామెంట్లు చేశారు.

click me!