భయంతో కాదు... నిజాయితీతోనే దేశం నడుస్తుంది: రాహుల్ గాంధీ

Arun Kumar P   | ANI
Published : May 16, 2025, 03:07 PM IST
భయంతో కాదు... నిజాయితీతోనే దేశం నడుస్తుంది: రాహుల్ గాంధీ

సారాంశం

గుజరాత్ సమాచార్ సహ వ్యవస్థాపకుడు బహుబలి షా అరెస్టును కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఖండించారు. దీన్ని ప్రజాస్వామ్యాన్ని అణచివేసే కుట్రగా అభివర్ణించారు. దేశం భయంతో కాదు, నిజాయితీ, రాజ్యాంగంతో నడుస్తుందని అన్నారు.

Rahul Gandhi : గుజరాత్ సమాచార్ సహ వ్యవస్థాపకుడు బహుబలి షా అరెస్టును కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఖండించారు. మొత్తం ప్రజాస్వామ్యాన్నే అణచివేసే కుట్రగా అభివర్ణించారు. దేశం భయంతో కాదు... నిజాయితీ, రాజ్యాంగంతో నడుస్తుందని అన్నారు.

అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే మీడియాపై దాడులు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనడానికి సంకేతమని రాహుల్ అన్నారు. బహుబలి షా అరెస్టు మోడీ ప్రభుత్వం ఎంతలా భయపడుతుందో తెలియజేస్తోందని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. గుజరాత్ సమాచారాన్ని గుట్టుగా ఉంచడంకోసం మీడియా స్వరాన్ని నొక్కుతున్నారు.. ఇది మొత్తం ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేసే కుట్రగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే వార్తాపత్రికలను మూసివేస్తే, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అర్థమని రాహుల్ గాంధీ అన్నారు. "బహుబలి షా అరెస్టు భయ రాజకీయాల్లో భాగం, ఇది ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి గుర్తింపు చిహ్నంగా మారింది" అని ఆయన అన్నారు.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా బహుబలి షా అరెస్టును ఖండించారు. ఆదాయపు పన్ను (IT), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడుల తర్వాత ఆయన అరెస్టు జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) ప్రతి ప్రశ్నించే గొంతును మూసేయాలని చూస్తోందని  ఆయన అన్నారు. గుజరాత్ ప్రజలు త్వరలోనే ఈ నియంతృత్వానికి సమాధానం ఇస్తారని కేజ్రీవాల్ హెచ్చరించారు. .

"గత 48 గంటల్లో గుజరాత్ సమాచార్, GSTVపై ఐటి, ఈడి దాడులు, ఆపై వాటి యజమాని బహుబలి భాయ్ షా అరెస్టు... ఇవన్నీ యాదృచ్చికం కాదు. నిజం మాట్లాడే, ప్రశ్నించే ప్రతి స్వరాన్ని నొక్కాలని చూస్తున్నారు. దేశ ప్రజలు, గుజరాత్ ప్రజలు త్వరలోనే ఈ నియంతృత్వానికి సమాధానం ఇస్తారు" అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !