Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో మోడీ నినాదాలు.. బస్సు దిగి వచ్చిన రాహుల్ గాంధీ

By Mahesh KFirst Published Jan 21, 2024, 11:12 PM IST
Highlights

రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ జోడో యాత్ర అసోం సాగుతుండగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. రాహుల్ గాంధీ బస్సు రాగానే నువు ఏం చెప్పదలచుకున్నావ్ అని అడిగారు. జై శ్రీరామ్, మోడీ మోడీ నినాదాలు ఇచ్చారు. దీంతో బీజేపీ మద్దతుదారులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ రాహుల్ గాంధీ సంచలనం సృష్టిచారు.
 

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అసోం గుండా ఆయన ఈ యాత్ర చేపడుతున్నప్పటి కొన్ని వీడియో క్లిప్‌లు బయటకు వచ్చాయి. ఒక క్లిప్‌ను స్వయంగా రాహుల్ గాంధీ విడుదల చేశారు. ఆ వీడియో క్లిప్ వైరల్ అవుతున్నది.

ఆ వీడియో క్లిప్‌లో రాహుల్ గాంధీ ‘మొహబత్ కి దుకాణ్’ బస్సులో కూర్చుని వెళ్లుతుండగా చాలా మంది యువకులు, వయోజనులు జెండాలతో తారసపడ్డారు. కొందరు కాంగ్రెస్ జెండాలు పట్టుకుంటే మరికొందరు కాషాయ జెండాలు పట్టుకున్నారు. రాహుల్ గాంధీ బస్సు సమీపించగానే కొందరు జై శ్రీరామ్ అనే నినాదాలు ఇచ్చారు. మోడీ.. మోడీ.. అంటూ అరిచారు. ఈ మాటలు వినగానే రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. బస్సులో నుంచే ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చారు.

Latest Videos

Also Read :  ‘‘నా పేరులోనే శివుడు.. మా సీఎం పేరులో రాముడు.. మాకెవ్వరూ చెప్పొద్దు..’’- డీకే శివ కుమార్

బస్సును ఇక్కడే ఎందుకు ఆపకూడదు? అని అధికారులను రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆయన సిబ్బంది మాత్రం తర్జనభర్జన పడ్డారు. ఆ తర్వాత బస్ డోరు ఓపెన్ చేయగా రాహుల్ గాంధీ ఆ సమూహంలోకి వెళ్లిపోయారు. అక్కడ పరిస్థితులు అదుపు దాటి పోకుండా భద్రతా సిబ్బంది అరికట్టగలిగారు.

‘‘నా పేరులోనే శివుడు.. మా సీఎం పేరులో రాముడు.. మాకెవ్వరూ చెప్పొద్దు..’’- డీకే శివ కుమార్

ఆ తర్వాత అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత్ ఏకం అవుతుందని, హిందుస్తాన్ గెలుస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ.. మోడీ.. నినాదాలు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ.. బీజేపీ సపోర్టర్లకు కిస్‌లు వదిలారు.

click me!