అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం (ayodhya ram mandir pran pratishtha) నేపథ్యంలో దేశంంలోని అనేక ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు అందంగా ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ (Mukesh ambani house_Antilia) ఇళ్లు కూడా అందంగా అలంకరించారు.
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ముందు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇల్లు 'ఆంటిలియా' అందంగా ముస్తాబైంది. శ్రీరాముని పవిత్రోత్సవం నేపథ్యంలో ఆయన ఇంటిపై ‘జై శ్రీరామ్’ నినాదాలు కనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వావ్.. అంతరిక్షం నుంచి అయోధ్య ఆలయాన్ని ఫొటో తీసిన ఇస్రో శాటిలైట్.. ఎలా ఉందో చూశారా ?
ఆంటిలియాలోని రాముడి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఇంటిని పూల బొకేలు, రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఆంటిలియాలోని ఇతర ప్రాంతాలు కూడా రాముడికి స్వాగతం పలికేందుకు అలంకరించారు. ఇంటి లోపల, వెలుపల హిందూ మతానికి సంబంధించిన చిహ్నాలు, శ్రీరామునికి సంబంధించిన చిత్రాలు అమర్చారు.
One of Richest Man in World, Mukesh Ambani's house 'Antilia' is all decked up before Ram Lala's Pran Pratishtha pic.twitter.com/pPN8ZvQdbR
— Megh Updates 🚨™ (@MeghUpdates)శ్రీరాముడి పట్టాభిషేకానికి హాజరయ్యేందుకు తాము ఎంతో ఉత్సాహంగా ఉన్నామని అంబానీ కుటుంబం తెలిపింది. ఇది చారిత్రాత్మక ఘట్టమని, ఈ సందర్భంగా తాను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా తిష్ఠాపన వేడుకకు ఆహ్వానం అందుకున్న భారతీయ పరిశ్రమకు చెందిన వ్యక్తులలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అలాగే పారిశ్రామికవేత్తలైన రతన్ టాటా, గౌతమ్ అదానీకి కూడా ఈ ఆహ్వానం అందింది.