పంజాబ్ ప్రమాదం: సెల్ఫీల మోజులో పడి

By Nagaraju TFirst Published Oct 20, 2018, 2:36 PM IST
Highlights

స్నేహితులతో బంధువులతో ఆనందాన్ని పంచుకునే సెల్పీలు అంతులేని విషాదాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. సెల్ఫీల కోసం రిస్క్ లు చేస్తూ ఎంతో మంది తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. అయితే శుక్రవారం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో జరిగిన రైలు ప్రమాదంలో అంతమంది చనిపోవడానికి కారణం కూడా సెల్ఫీ పిచ్చేనని స్థానికులు చెప్తున్నారు. 
 

అమృత్ సర్: స్నేహితులతో బంధువులతో ఆనందాన్ని పంచుకునే సెల్పీలు అంతులేని విషాదాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. సెల్ఫీల కోసం రిస్క్ లు చేస్తూ ఎంతో మంది తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. అయితే శుక్రవారం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో జరిగిన రైలు ప్రమాదంలో అంతమంది చనిపోవడానికి కారణం కూడా సెల్ఫీ పిచ్చేనని స్థానికులు చెప్తున్నారు. 

అమృత్ సర్ లోని చౌరాబజార్ లో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ రావణ దహన కార్యక్రమం రైల్వేట్రాక్ పక్కనే నిర్వహించడం ఘటనకు ప్రధాన కారణమైతే సెల్ఫీల మోజు మరో కారణంగా స్థానికులు చెప్తున్నారు. 

రావణ దహనాన్ని తిలకిస్తున్న ప్రజలు సెల్ఫీలు తీసుకుంటూ రైలు వస్తుందన్న విషయాన్ని గమనించలేదని చెప్తున్నారు. మరికొంతమంది వీడియోలు తీసుకుంటూ అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 

ఒక వైపు బాణాసంచా శబ్ధాలు.. మరో వైపు  సెల్ ఫోన్‌లో బిజీగా ఉన్న జనాలు తాము ఉన్న పరిసారలను మర్చిపోయారు. ఇంతలో రైల్వే ట్రాక్‌పై నిల్చుని రావణ దహన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలపైకి డీఎంయూ రైలు మృత్యువులా దూసుకొచ్చింది. 

వేరే ట్రాక్ పై వెళ్లి తప్పించుకుందాం అనుకునే సరికి ఆ ట్రాక్ పైనా అదే సమయంలో మరో రైలు రావడంతో తప్పించుకునే అవకాశం లేకపోయింది. దాంతో దసరా పండుగ నాడే వారంతా మృత్యు కౌగిలిలో చిక్కుకుపోయారు. ఈ రైలు ప్రమాదంలో 61 మంది మృతి చెందగా...మరో 72 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

దసరా ఉత్సవాల విషయం తెలియదు: రైల్వే బోర్డు ఛైర్మెన్ అశ్విని లోహానీ

పంజాబ్ ప్రమాదం: 61 మంది మృతి, 72 మందికి గాయాలు

పంజాబ్ ప్రమాదం: ఘటనకు ముందే అక్కడి నుండి వెళ్లిపోయా: నవజ్యోత్ కౌర్

కళ్లెదుట ఘోరం జరిగినా పట్టించుకోని సిద్ధూ భార్య: స్థానికుల ఆగ్రహం

పంజాబ్ రైలు ప్రమాదం: బాణసంచా పేలుళ్లే కారణమా?
పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం: 50 మందికి పైగా దుర్మరణం

 


 

click me!