పంజాబ్ ప్రమాదం: ట్రాక్ క్లియరెన్స్ ఇచ్చారు: రైలు డ్రైవర్

Published : Oct 20, 2018, 02:13 PM IST
పంజాబ్ ప్రమాదం:  ట్రాక్ క్లియరెన్స్ ఇచ్చారు: రైలు డ్రైవర్

సారాంశం

అమృత్‌సర్ రైల్వేస్టేషన్ అధికారులు రైల్వే ట్రాక్ క్లియర్‌గా ఉందని  తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని  అమృత్ సర్ వద్ద రైలు ఢీకొని 61 మంది మృతికి కారణమైన రైలు డ్రైవర్ పోలీసుల విచారణలో వెల్లడించారు.

అమృత్‌సర్: అమృత్‌సర్ రైల్వేస్టేషన్ అధికారులు రైల్వే ట్రాక్ క్లియర్‌గా ఉందని  తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని  అమృత్ సర్ వద్ద రైలు ఢీకొని 61 మంది మృతికి కారణమైన రైలు డ్రైవర్ పోలీసుల విచారణలో వెల్లడించారు.

అమృత్‌సర్ వద్ద  జరిగిన రైలు ప్రమాదానికి కారణమైన  డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.  ఈ ప్రమాదం గురించి ట్రైన్ డ్రైవర్  అమృత్‌సర్ స్టేషన్ మాస్టర్ కు , రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. 

ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన ప్రాంతం చీకటిగా ఉండడంతో జనాన్ని తాను గుర్తించలేకపోయినట్టు  డ్రైవర్ విచారణ సమయంలో పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.

డ్రైవర్ ఇచ్చిన సమాచారాన్ని  పోలీసులు రికార్డు చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైల్వేమెన్‌ను నియమించినా  రైలు డ్రైవర్ కు  ఈ విషయాన్ని తెలపలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.

రైల్వే ట్రాక్ పై  నిలబడి రావణ దహనం చూస్తున్న వారిని ఢీకొట్టుకొంటూ  రైలు వెళ్లింది. ఈ ఘటనలో 61 మంది మృతి చెందగా, మరో 72 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై  రైల్వేశాఖాధికారులు విచారణ నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

దసరా ఉత్సవాల విషయం తెలియదు: రైల్వే బోర్డు ఛైర్మెన్ అశ్విని లోహానీ

పంజాబ్ ప్రమాదం: 61 మంది మృతి, 72 మందికి గాయాలు

పంజాబ్ ప్రమాదం: ఘటనకు ముందే అక్కడి నుండి వెళ్లిపోయా: నవజ్యోత్ కౌర్

పంజాబ్ రైలు ప్రమాదం: బాణసంచా పేలుళ్లే కారణమా?
పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం: 50 మందికి పైగా దుర్మరణం

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌