అలా చెప్పలేదు: పార్టీపై తేల్చేసిన రజనీకాంత్

Published : Oct 20, 2018, 01:12 PM ISTUpdated : Oct 20, 2018, 01:21 PM IST
అలా చెప్పలేదు: పార్టీపై తేల్చేసిన రజనీకాంత్

సారాంశం

 ఈ ఏడాది డిసెంబర్ 12వ, తేదీన  పార్టీ, ఎజెండాను ప్రకటిస్తానని తాను చెప్పలేదని తమిళ సూపర్‌స్టార్  రజనీకాంత్  స్పష్టం చేశారు.

చెన్నై:  ఈ ఏడాది డిసెంబర్ 12వ, తేదీన  పార్టీ, ఎజెండాను ప్రకటిస్తానని తాను చెప్పలేదని తమిళ సూపర్‌స్టార్  రజనీకాంత్  స్పష్టం చేశారు.

శనివారం నాడు ఆయన ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. పార్టీ నిర్మాణం కోసం  90 శాతం  పనులు పూర్తైనట్టు ఆయన చెప్పారు. డిసెంబర్ 12వ తేదీన పార్టీ పేరును, ఎజెండాను ప్రకటిస్తానని  తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు.

పార్టీని ఎప్పుడు  ప్రకటిస్తాననే విషయాన్ని ఇప్పుడే చెప్పలేనని ఆయన తేల్చి చెప్పేశారు.మీటూ ఉద్యమం మహిళలకు మంచిది కానీ.. దీన్ని దుర్వినియోగం చేయొద్దన్నారు. సంస్కృతి సంప్రదాయాల్లో ఎవరూ కూడ జోక్యం చేసుకోకూడదని రజనీకాంత్ సూచించారు.

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తానని చెబుతూనే సంప్రదాయాలను అనుసరించాల్సిన అవసరాన్ని కూడ ఆయన నొక్కి చెప్పారు.ప్రతి ఆలయానికి ఒక చరిత్ర, సంప్రదాయం ఉంటుందన్నారు. 

ఇప్పటికే మరో తమిళ అగ్రనటుడు కమల్‌హాసన్  పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లారు.  ఈ ఏడాది డిసెంబర్ 12వ తేదీన రజనీకాంత్ తన పార్టీ పేరును  ప్రకటిస్తారనే విషయమై వచ్చిన వార్తలపై  రజనీకాంత్ మీడియాకు స్పష్టత ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System