లీటర్ పెట్రోల్‌పై అదనంగా రూ. 10 తగ్గింపు.. పంజాబ్ ప్రభుత్వ ప్రకటన

By telugu team  |  First Published Nov 7, 2021, 5:18 PM IST

పంజాబ్ ప్రభుత్వం చమురు ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ ధరపై రూ. 10, లీటర్ డీజిల్ ధరపై రూ. 5 వ్యాట్ తగ్గిస్తున్నట్టు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రకటించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తగ్గింపునకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు మరింత ఊరటనిచ్చినట్టయింది.
 


న్యూఢిల్లీ: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం Diwali కానుకగా అందించిన చమురు Prices తగ్గింపు నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అదే దారిలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు నడిచాయి. అదనంగా తగ్గింపులు చేపట్టాయి. తాజాగా, పంజాబ్ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్లింది. లీటర్ Petrol ధరపై అదనంగా మరో రూ. 10 తగ్గిస్తూ సంచలన ప్రకటన చేసింది. లీటర్ Diesel పై రూ. 5 తగ్గించింది. Punjab Assembly Elections సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్య మంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఈ ప్రకటన చేశారు. గడిచిన 70 ఏళ్లలో
ఇలాంటి నిర్ణయం వెలువడలేదని అన్నారు. 

ఈ రీజియన్‌లో పంజాబ్‌లోనే చౌకగా చమురు లభిస్తుందని సీఎం చన్నీ తెలిపారు. ఢిల్లీతో పోల్చితే ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 9 చౌకగా లభిస్తుందని వివరించారు. తగ్గిన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

Latest Videos

undefined

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంతో Fuel ధరలు దిగి రానున్నాయి. పంజాబ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.16, డీజిల్ ధర రూ. 84.80గా ఉండనుంది. చండీగడ్‌లో మరింత చౌకగా ఇంధన అందుబాటులోకి రానుంది. చండీగడ్‌లో లీటర్ పెట్రోల్ రూ. 94.23, డీజిల్ రూ. 80గా ఉండనుంది. కాగా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్తాన్, జమ్ము కశ్మీర్‌లో ధరలు ఎక్కువగానే ఉన్నాయి.

Also Read: త్వరలోనే మరో బిగ్ షాక్..? పెట్రోల్ ధర లీటరుకు రూ.200 దాటుతుందా..?

పది బీజేపీ పాలిత రాష్ట్రాలు అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత చమురు ధరలు తగ్గింపు నిర్ణయాన్ని అమలు చేశాయి. వ్యాట్‌ తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి.

ఇందులో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌‌లలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

Also Read: Petrol , Diesel Price Cut: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

పెట్రోల్, డీజిల్ ధరల్లో బేసిక్ ఆయిల్ ధర, విలువ ఆధారిత పన్ను, కేంద్ర ఎక్సైజ్, డీలర్ల కమిషన్‌లు కలగలసి ఉంటాయి. కొంత కాలంగా ధరలు పెరుగుతూనే వచ్చాయి. కానీ, దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీపావళి కానుకగా చమురు ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ ధరపై రూ. 5, లీటర్ డీజిల్ ధరపై రూ. 10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఆ వెంటనే బీజేపీ పాలిత రాష్ట్రాలూ వ్యాట్ తగ్గిస్తూ బంపర్ ఆఫర్ ప్రకటించాయి.

click me!