వాట్సాప్‌లో గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్.. చివరకు రూ. 5 లక్షలు దోచేశారు..

By team teluguFirst Published Nov 7, 2021, 5:10 PM IST
Highlights

ఓ వ్యక్తి వాట్సాప్ (WhatsApp) చాట్ పరిచయం కారణంగా.. రూ. 5 లక్షలకు పైగా మోసపోయాడు. తొలుత గుడ్ మార్నింగ్‌ మెసేజ్‌‌తో వీరి మధ్య సంభాషణలు సాగాయి. ఈ ఘటన కర్ణాటకలో ని బెంగళూరులో (Bengaluru) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి గోవిందపుర పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం చాలా మంది జీవితంలో భాగం అయిపోయింది. దీంతో మంచితో పాటు చెడు కూడా జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా పరిచయాలు పెంచుకుంటున్న కొందరు అపరిచితులు.. ఆ తర్వాత డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల వెలుగుచూస్తున్నాయి. తాజాగా వాట్సాప్ (WhatsApp) చాట్ పరిచయం కారణంగా.. రూ. 5 లక్షలకు పైగా మోసపోయాడు. తొలుత గుడ్ మార్నింగ్‌ మెసేజ్‌‌తో వీరి మధ్య సంభాషణలు సాగాయి. ఈ ఘటన కర్ణాటకలో ని బెంగళూరులో (Bengaluru) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి గోవిందపుర పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.

50 ఏళ్ల బాధిత వ్యక్తి రెండేళ్ల క్రితం అపరిచిత వ్యక్తి నుంచి వాట్సాప్‌లో గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె నుంచి 20సార్లకు పైగా ఈ మెసెజ్‎లు అందుకున్నాడు. ఈ క్రమంలో గత నెల అక్టోబర్ 8న ఆమె నుంచి మిమ్మల్ని కలవాలనుకుంటున్నానంటూ మెసెజ్ వచ్చింది. తనను కలవడానికి వీరనపాళ్యం సమీపంలోని ఓ హోటల్‌కు రావాలంటూ మహిళ లొకేషన్ కూడా షేర్ చేసింది. 

Also read: యూపీ ఫతేనగర్‌ జైలులో ఖైదీల వీరంగం:సిబ్బందిపై దాడి, జైలుకు నిప్పు

దీంతో అతడు వీరపాళ్యం సమీపంలోని హోటల్‌కు ఆమెను కలిసేందుకు వెళ్లాడు. అయితే ఆ గదిలో ముగ్గురు వ్యక్తులు ఉండటం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. అక్కడున్న ముగ్గురు తాము పోలీసులమని బాధితుడికి చెప్పారు. బాధితున్ని డ్రగ్స్ వ్యాపారి అని ఆరోపించి.. డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరింపుకు పాల్పడ్డారు. వెంటనే అతని వద్ద నుంచి క్రెడిట్ కార్డు, వాలెట్ లాకున్నారరు. ఫోన్‌ను అన్ లాక్ చేయమని బలవంతం చేశారు. అనంతరం బాధితుడిని హోటల్ గదిలో బంధించి.. వారు అక్కడి నుంచి బయటపడ్డారు.

Also read:మాజీ భర్తమీది కోపం.. ఐదుగురు పిల్లలకు మత్తుమందిచ్చి చంపిన కన్నతల్లికి...జీవితఖైదు

అనంతరం హోటల్‌ నుంచి ఎలాగోలా బయటపట్ట బాధితుడు ఇంటికి చేరుకున్నాడు. అయితే అతను ఇంటికి చేరుకునే లోపు అతని ఖాతా నుంచి ఐదు విడుతలుగా రూ. 3,91,812 డెబిట్ అయినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత కాసేపటికే మరో రూ. 2 లక్షలు కూడా ట్రాన్స్‌ఫర్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు గోవిందపుర పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 

click me!