యూపీ ఫతేనగర్‌ జైలులో ఖైదీల వీరంగం:సిబ్బందిపై దాడి, జైలుకు నిప్పు

By narsimha lodeFirst Published Nov 7, 2021, 4:47 PM IST
Highlights

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేనగర్ సెంట్రల్ జైలులో ఖైదీలు వీరంగం సృష్టించారు. జైలు సిబ్బందిపై దాడికి దిగారు. ఇద్దరు డిప్యూటీ జైలర్లను ఖైదీలు బంధించారు.

లక్నో: Uttar Pradesh రాష్ట్రంలోని Fatehgarh  సెంట్రల్ జైలులో ఖైదీలు వీరంగం సృష్టించారు. జైలు సిబ్బందిపై దాడికి దిగారు. ఇద్దరు డిప్యూటీ జైలర్లను జైలులో బంధించారు.ఆదివారం నాడు ఉదయం ఈ జైలులో అల్లర్లు చెలరేగాయి. జైలులో కొంత బాగానికి prioners నిప్పంటించారు. అంతేకాదు ఖైదీలు కొందరు జైలు అధికారులపై రాళ్లతో దాడికి దిగారు. ఇద్దరు డిప్యూటీ జైలర్లు అఖిలేష్ కుమార్, శైలేష్ కుమార్లు ఖైదీల చెరలో ఉన్నారు.

also read:మాజీ భర్తమీది కోపం.. ఐదుగురు పిల్లలకు మత్తుమందిచ్చి చంపిన కన్నతల్లికి...జీవితఖైదు

అయితే ఖైదీలను చెదరగొట్టేందుకు పోలీసులు, జైలు అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా ప్రయోజనం లేదని జైలు ఉన్నతాధికారులు తెలిపారు.సందీప్ కుమార్ అనే అండర్ ట్రయల్ ఖైదీ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఖైదీలు ఆగ్రహంతో వీరంగం సృష్టించారు. సందీప్ కుమార్ కు చికిత్స అందించడానికి ఆలస్యం చేశారని ఖైదీలు ఆరోపిస్తున్నారు. 

మరోవైపు సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రస్తుతం జైలు ప్రాంగణంలో ఖైదీలను శాంతింపజేసే పనిలో ఉన్నారని ఫరూఖాబాద్ అదనపు ఎస్పీ అజయ్ పాల్ సింగ్ చెప్పారు.మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జైలు వద్దకు భారీగా పోలీస్ బలగాలను తరలించారు.

ఖైదీల దాడిలో సుమార 30 మంది పోలీసులు గాయపడ్డారు. గాయపడిన పోలీసులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మేరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న సందీప్ హత్య కేసులో జైలులో ఉన్నాడు  జైలులో ఉన్న సందీప్  అనారోగ్యంతో మరణించారు. జైలులో ఉన్న సమయంలో ఆయన చికిత్స పొందుతూ చనిపోయిన విషయాన్ని తెలుసుకొన్న ఖైదీలు వీరంగం సృష్టించారు.

సందీప్ కుమార్ చనిపోయిన విషయం తెలుసుకొన్న ఖైదీలు ఇద్దరు డిప్యూటీ జైలర్లను తీవ్రంగా కొట్టారు.ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకొన్న సీఓ ప్రదీప్ సింగ్, ఫతేఘర్ కొత్వాల్, జై ప్రకాష్ పాల్ కొందరు పోలీసులు చేరుకొన్నారు. దీపావళి రోజున సరైన భోజనం కూడా అందడం లేదని ఖైదీలు ఆరోపిస్తున్నారు. దీపావళి రోజున జైలును ఓపెన్ చేయకపోవడంతో తాము ఎవరిని కలవలేకపోయామని ఖైదీలు ఆరోపించారు.


 

click me!