బీఎస్ఎఫ్ అధికార పరిధి పెంపు: మా పోలీసులను అవమానిస్తారా ... కేంద్రంపై ఆగ్రహం, పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం

Siva Kodati |  
Published : Nov 11, 2021, 04:19 PM ISTUpdated : Nov 11, 2021, 04:22 PM IST
బీఎస్ఎఫ్ అధికార పరిధి పెంపు: మా పోలీసులను అవమానిస్తారా ... కేంద్రంపై ఆగ్రహం, పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం

సారాంశం

బీఎస్‌ఎఫ్‌ (bsf) అధికార పరిధిని పెంచుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై పంజాబ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గురువారం పంజాబ్‌ అసెంబ్లీ (punjab assembly) ఏకగ్రీవంగా ఆమోదించింది

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ (congress) అధికారంలో వున్న పంజాబ్ రాష్ట్రం (punjab) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి నిరసన తెలిపింది. వివరాల్లోకి వెళితే.. బీఎస్‌ఎఫ్‌ (bsf) అధికార పరిధిని పెంచుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై పంజాబ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గురువారం పంజాబ్‌ అసెంబ్లీ (punjab assembly) ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి సుఖ్‌జీందర్ సింగ్ రంధావా (sukhjinder singh randhawa) తీర్మానం ప్రవేశపెడుతూ.. అక్టోబర్‌ 11న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ministry of home affairs) జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

ఈ సందర్భంగా జరిగిన చర్చలో హోంమంత్రి రాంధావా మాట్లాడుతూ పంజాబ్‌ అమరవీరులు, వీరుల భూమి అని గుర్తుచేశారు. పంజాబీలు దేశ స్వాతంత్య్ర పోరాటం, 1962, 1965, 1971, 1999 యుద్ధాల్లో అసమానమైన త్యాగాలు చేశారని, దేశంలోనే అత్యధిక శౌర్య పురస్కారాలు పంజాబీలు అందుకున్నారని రాంధావా గుర్తు చేశారు. తాజాగా బీఎస్ఎఫ్ అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచాలన్న నిర్ణయం పంజాబ్‌, ఇక్కడి పోలీసులపై ఉన్న అపనమ్మకంగా రాంధావా వ్యాఖ్యానించారు. కేంద్రం నిర్ణయం తీసుకునే ముందు పంజాబ్‌ ప్రజలను సంపద్రించి ఉండాల్సిందని అన్నారు. పంజాబ్‌లో శాంతిభద్రలు పటిష్టంగా ఉన్నాయని.. బీఎస్‌ఎఫ్‌ అధికార పరిధిని విస్తరించాల్సిన అవసరం లేదని గుర్తుచేశారు. ఈ చర్య భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘించడమేనన్నారు. కేంద్రం వెంటనే నోటిఫికేషన్‌ను ఉప సంహరించుకోవాలని హోంమంత్రి డిమాండ్‌ చేశారు.

ALso Read:ఆ మూడు రాష్ట్రాల్లో బీఎస్ఎఫ్ పరిధి పెంపు.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం...

కాగా... కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సరిహద్దు భద్రతా దళం అధికారాల పరిధిని ఇటీవల పెంచింది. ఈ మేరకు Border Security Force అధికారులకు అరెస్టు, సెర్చ్, స్వాధీనం చేసుకునే అధికారాలను ఇచ్చింది. ఈ అధికార పరిధి పశ్చిమ బెంగాల్, పంజాబ్, అసోం మూడు రాష్ట్రాలలో విస్తరించారు. అక్టోబర్ 14న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, అంతర్జాతీయ సరిహద్దులను కాపాడే రాష్ట్రాలలో బిఎస్‌ఎఫ్ తన అధికారాలను అమలు చేయడానికి జూలై 2014 కంటే ముందటి నోటిఫికేషన్ షెడ్యూల్‌ను సవరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లోని భారతదేశం-పాకిస్తాన్, భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి  International Border నుండి భారత భూభాగం లోపల 50 కిలోమీటర్ల వరకు ప్రాంతీయ అధికార పరిధిని హోం మంత్రిత్వ శాఖ పెంచింది. ఇది కాకుండా, బిఎస్ఎఫ్ నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్, లడఖ్‌లో కూడా సెర్చులు చేయడం, అరెస్టులు చేసే అధికారాలు కలిగి ఉంది. 

మరోవైపు, గుజరాత్‌లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికార పరిధి తగ్గించబడింది. సరిహద్దు విస్తీర్ణంకూడా  80 కి.మీ నుండి 50 కిమీకి తగ్గించబడింది, రాజస్థాన్‌లో వ్యాసార్థం ప్రాంతం 50 కిమీగా మార్చబడింది. ఐదు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్,  Jammu and Kashmir, లడఖ్‌కు సరిహద్దులు నిర్ణయించబడలేదు. అప్పట్లోనే కేంద్రం నిర్ణయంపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. ఈ చర్యను 'ఫెడరలిజంపై ప్రత్యక్ష దాడి'గా పేర్కొంటూ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్