Srabanti Quits BJP: బీజేపీకి మరో షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన ప్రముఖ నటి స్రబంతి

By team teluguFirst Published Nov 11, 2021, 3:50 PM IST
Highlights

ప్రముఖ నటి స్రబంతి చటర్జీ (Srabanti Chatterjee) బీజేపీకి (BJP) గుడ్‌ బై చెప్పారు. ఈ మేరకు ఆమె గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. అయితే స్రబంతి రాజీనామా నేపథ్యంలో.. ఆమె తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ వరుస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. తాజాగా ప్రముఖ నటి స్రబంతి చటర్జీ (Srabanti Chatterjee) బీజేపీకి (BJP) గుడ్‌ బై చెప్పారు. ఈ మేరకు ఆమె గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. అయితే బెంగాల్ ఎన్నికలకు కొద్ది రోజులు ముందు ( ఈ ఏడాది మార్చి 2వ తేదీన) బీజేపీలో చేరింది. బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచింది. ‘నేను గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన పార్టీ BJPతో అన్ని సంబంధాలను తెంచుకున్నాను. బెంగాల్‌ను అభివృద్దిలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి వారికి చొరవ, చిత్తశుద్ధి లేకపోవడమే కారణం’ అని ఆమె ట్వీట్ చేశారు. 

స్రబంతి చటర్జీ రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆమె త్వరలోనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం మొదలైంది. అయితే ఓ జర్నలిస్ట్ ప్రశ్నకు ట్విట్టర్‌ వేదికగా జవాబు ఇచ్చిన నటి.. కాలమే సమాధానం చెబుతుందని Srabanti పేర్కొన్నారు.

Also read: Priyanka Gandhi: ప్రియాంక మరో హామీ.. అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు నెలకు రూ. 10 వేలు.. 

ఇక, బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక సమయంలో సినీ సెలబ్రిటీలు పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రాకను పార్టీలోని కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకించారు. కానీ వారిని పట్టించుకోకుండా పలువురు సీని నటులను బీజేపీ పార్టీలో చేర్చుకుంది. వారిలో కొందరికి పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిపింది. అందులో స్రబంతి చటర్జీ ఒకరు.

ఆమె బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమెపై తృణమూల్ కాంగ్రెస్‌ నుంచి పోటీలో నిలిచి పార్థా చటర్జీ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమె కేవలం 60,000 ఓట్లు మాత్రమే సాధించారు. ఇక, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పలువురు సొంత పార్టీ కార్యకర్తలే ఆమెపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్టుగా కనిపించలేదు. ఈ క్రమంలోనే నేడు బీజేపీకి గుడ్ బై చెప్పినట్టగా ప్రకటించారు. 

ఇక, పశ్చిమ బెంగాల్‌లో ప్రతిష్టాత్మకంగా తీసుకన్న బీజేపీ.. అక్కడ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి బీజేపీకి ఆ రాష్ట్రంలో వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. పార్టీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే ముకుల్‌ రాయ్‌, తన్మయ్‌ ఘోష్‌, విశ్వజిత్‌ దాస్‌, సౌమోన్‌ రాయ్‌లు బీజేపీని వీడి తృణమూల్ కండువా కప్పుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ అయిన బాబుల్ సుప్రియో కూడా బీజేపీ గుడ్ బై చెప్పారు. ఆయన టీఎంసీ జాతీయ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సమక్షంలో తృణమూల్ కండువా కప్పుకొన్నారు. 

click me!