కరోనా ఎఫెక్ట్: పుణెలో 12 గంటల పాటు కర్ప్యూ, ఫుడ్ హోం డెలీవరీ

By narsimha lodeFirst Published Apr 2, 2021, 3:07 PM IST
Highlights

కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతుండడంతో  12 గంటల పాటు కర్ప్యూ విధించాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

ముంబై:కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతుండడంతో  12 గంటల పాటు కర్ప్యూ విధించాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. వారం రోజుల పాటు ఈ కర్ఫ్యూను విధించాలని అధికారులు నిర్ణయించారు.

మత పరమైన ప్రదేశాలు, హోటల్స్, బార్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లన్నీ మరో వారం రోజుల పాటు మూసివేయనున్నట్టు పుణె డివిజనల్ కమిషనర్ సౌరభ్ రావు తెలిపారు.ఈ సమయంలో ఆహార పదార్ధాలు, మందులు, అత్యవసర సరుకులను ఇంటికి సరఫరా చేయనున్నట్టుగా అధికారులు తెలిపారు.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న  ప్రాంతాల్లో పుణె ఒకటి.  పుణెలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. బుధవారం నాడు పుణెలో 8,605 కేసులు నమోదయ్యాయి. గురువారం నాడు 8,011 కేసులు రికార్డయ్యాయి.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 80 శాతం బెడ్స్ కరోనా రోగులకు సిద్దం చేయాలని పుణె మేయర్ ముర్లిధర్  మొహల్ చెప్పారు. అయితే  లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు ప్రస్తుతానికి అవసరం లేదన్నారు.

ముంబైలో కూడ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  గురువారం నాడు ముంబైలో 8646 కేసులు నమోదయ్యాయి.ఇటీవల కాలంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.షాపింగ్ మాల్స్, బస్ స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. చాలా మంది ఫేస్ మాస్కులు ధరించకపోవడం భౌతిక దూరాన్ని పాటించడం లేదని అధికారులు గుర్తించారు.

ముంబైలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని  ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ చెప్పారు. ఈ ఏడాది మార్చి నుండి అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరినా పట్టించుకోవడం లేదన్నారు.లాక్‌డౌన్ ను ఎవరూ కోరుకోవడం లేదన్నారు. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

click me!