పుల్వామా దాడి: భద్రతా బలగాలపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్య

By telugu teamFirst Published Feb 15, 2019, 11:30 AM IST
Highlights

పుల్వామాలోని అవంతిపొరాలో జరిగిన కారు బాంబు దాడి సంఘటనపై జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిఘా వైఫల్యం వల్లనే  ఈ సంఘటన జరిగిందనే ఆరోపణలను ఆయన తప్పు పట్టారు.

న్యూఢిల్లీ: పుల్వామాలోని అవంతిపొరాలో జరిగిన కారు బాంబు దాడి సంఘటనపై జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిఘా వైఫల్యం వల్లనే  ఈ సంఘటన జరిగిందనే ఆరోపణలను ఆయన తప్పు పట్టారు. నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారాన్ని భద్రతా బలగాలు నిర్లక్ష్యం చేశాయని ఆయన వ్యాఖ్యానిచారు. 

నిఘా వైఫల్యం ఏ మాత్రం లేదని, తమకు దాడికి సంబంధించిన సమాచారం ఉందని, అయితే ఒక రకమైన నిర్లక్ష్యం మాత్రం ఉందని ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఉగ్రవాదులు అంత పెద్ద వాహనాన్ని తీసుకుని రాగలిగారంటే అది ఓ విధమైన వైఫల్యమేనని ఆయన అన్నారు. 

పుల్వామా దాడికి ఉగ్రవాదులు తగిన ఫలితం అనుభవిస్తారని, వారి చర్యలను సమర్థంగా ఎదుర్కుంటామని ఆయన అన్నారు. పుల్వామా దాడి వెనక ఉన్నవారిని ఎవరిని కూడా వదిలేది లేదని అన్నారు. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టేస్తామని అన్నారు. 

తాము ఉగ్రవాదాన్ని అణచివేయడంలో విజయం సాధిస్తుండడంతో ఉగ్రవాదులు నిస్పృహకు గురయ్యారని, అప్ఘానిస్తాన్ లో మాదిరిగానే పుల్వామా దాడిని ఉగ్రవాదులు ప్లాన్ చేశారని ఆయన అన్నారు.  భద్రతా ఏర్పాట్లను సమీక్షించడానికి ఆర్మీ, సిఆర్పీఎఫ్, బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు రెండు, మూడు రోజుల్లో సమావేశమవుతారని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

పుల్వామా దాడి: పాకిస్తాన్‌కు మోడీ హెచ్చరికలు

42 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్: ఎవరీ ఆదిల్?

"నేను స్వర్గంలో ఉంటా": జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాది చివరి మాటలు

జమ్మూ కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి తెగబడిన ముష్కరులు..20మంది ఆర్మీ జవాన్ల మృతి

మాకేం లింక్: పుల్వామా దాడిపై పాక్ బుకాయింపు

click me!