
పరుగుల రాణి పీటీ ఉష, సంగీత దర్శకుడు ఇళయ రాజా, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డేలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. రాష్ట్రపతి కోటాలో వీరిని రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభకు నామినేట్ అయిన వీరిని ప్రధాని నరేంద్ర మోడీ అభినందిస్తూ ట్వీట్ చేశారు.