ఉమేశ్ కోహ్లీ హత్య కేసు.... దేశవ్యాప్తంగా 16 చోట్ల ఎన్ఐఏ సోదాలు, సోషల్ మీడియా పోస్టులపై ఆరా

Siva Kodati |  
Published : Jul 06, 2022, 08:07 PM ISTUpdated : Jul 06, 2022, 08:10 PM IST
ఉమేశ్ కోహ్లీ హత్య కేసు.... దేశవ్యాప్తంగా 16 చోట్ల ఎన్ఐఏ సోదాలు, సోషల్ మీడియా పోస్టులపై ఆరా

సారాంశం

ఉమేశ్ కోహ్లీ హత్య కేసులో ఎన్ఐఏ 16 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్లపై అనుమానితులపై ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున ఫోన్లు, సిమ్ లు, మెమొరీ కార్డులు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉమేశ్ కోహ్లీ హత్య కేసులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. 16 ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్లపై అనుమానితులపై ప్రశ్నల వర్షం కురిపించింది. నిందితులు, అనుమానితుల ఇళ్లలో ఎన్ఐఏ తనిఖీలు జరిపింది. పెద్ద ఎత్తున ఫోన్లు, సిమ్ లు, మెమొరీ కార్డులు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇకపోతే.. Rajasthan  రాష్ట్రంలోని Udaipur లో టైలర్ Kanhaiya Lal హత్య కేసు నిందితులకు Hyderabad తో లింకులున్నాయా అనే కోణంలో NIA  అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్ పూర్ లో టైలర్ ను హత్య చేసిన నిందితులు గతంలో హైద్రాబాద్ లో కూడా  ఉన్నారని ఎన్ఐఏ అధికారులు  తమ దర్యాప్తులో గుర్తించారు. ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్యలాల్ హత్య కేసులో ఇద్దరు నిందితులు  Ghous Mohammed, Mohammed Riyaz Attari లను ఎన్ఐఏ ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితులు హైద్రాబాద్ లోని సంతోష్ నగర్ ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.  గతంలో అట్టారి, మహమ్మద్ గౌస్ లు  హైద్రాబాద్ వచ్చినట్టుగా పోలీసులు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. 

Karachi నుండి నేరుగా హైద్రాబాద్ వచ్చారని ఎన్ఐఏ తమ దర్యాప్తులో గుర్తించారు.  ఈ ఇద్దరు నిందితులకు హైద్రాబాద్ లోని ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు మంగళవారం నాడు విచారించారు.  మున్వర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధిారులు విచారించి వదిలేశారు.ఈ నెల 14న జైపూర్ లో నిర్వహించే విచారణకు హాజరు కావాలని కూడా ఎన్ఐఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. మున్వర్, హుస్సేన్ ఆశ్రఫ్  లను ఎన్ఐఏ అధికారులు  విచారించారని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. వీరిని ఈ నెల 14న రాజస్థాన్ లో నిర్వహించే విచారణకు రావాలని ఎన్టీవీ తన కథనంలో తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?