ఆ సెక్సువల్ రిలేషన్.. పెళ్లితో సమానమా?

First Published Jul 3, 2018, 12:32 PM IST
Highlights


ఆ లైంగిక సంబంధానికి ఈ హక్కులు వర్తిస్తాయా..?

మన దేశంలో వివాహ బంధానికి ప్రాముఖ్యత ఎక్కువ. లివింగ్ రిలేషన్ షిప్ లాంటివి ఇప్పుడిప్పుడు మనదేశానికి పాకుతున్నప్పటికీ.. ప్రస్తుత యువత కూడా వివాహ బంధానికే ఓటు వేస్తున్నారు.ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు భార్యలకు తెలియకుండా భర్తలు ఇతర స్త్రీలతో శారీరక సంబంధాలు కొనసాగిస్తున్నవారు చాలా మంది ఉన్నారు.  అయితే.. సుధీర్ఘంగా లైంగిక సంబంధం కలిగి ఉండటం కూడా పెళ్లి కిందకే వస్తుందా..? ఇదే ప్రశ్న లేవనెత్తింది సుప్రీం కోర్టు.

సుదీర్ఘకాల లైంగిక సంబంధం పెళ్లితో సమానమా ? వివాహ బంధంలో ఉన్న హక్కులు.. లైంగిక సంబంధం కొన‌సాగిస్తున్న‌వారికి కూడా వర్తిస్తాయా ? ఈ ప్రశ్నలపై అటార్నీ జనరల్ నుంచి అభిప్రాయాలను కోరింది సుప్రీంకోర్టు. సోమవారం ఓ కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రశ్నలు వేసింది. అనేక కేసుల్లో ఈ సమస్యలు వస్తున్నాయని సుప్రీంకోర్టు వెల్లడించింది.

 ఒక వ్యక్తితో చాలా కాలం పాటు లైంగిక సంబంధం పెట్టుకోవడం లాంటి కేసులు చాలా వస్తున్నాయని, దాన్ని రేప్ కేసుగా పరిగణిస్తూ సదరు వ్యక్తిని శిక్షించలేమని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సుదీర్ఘకాల సంబంధాలను.. వివాహ బంధాలుగా గుర్తించాలా లేదా అన్న సందిగ్ధంలో సుప్రీంకోర్టు పడింది. సాధారణంగా అలాంటి సంబంధాలు పెట్టుకున్న వారికి కూడా బాధ్యతలు ఉంటాయని కోర్టు పేర్కొన్నది. రేప్ కేసు నమోదైన ఓ వ్యక్తి.. తనకు ఆ అభియోగాల నుంచి విముక్తి కల్పించాలంటూ అభ్యరించాడు.

 ఆ కేసును వాదిస్తున్న సుప్రీం ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసింది. తనకు ఓ స్త్రీతో చాలా కాలం నుంచి శారీరక సంబంధం ఉందని అతను తన పిటీషన్‌లో పేర్కొన్నాడు. వాస్తవానికి ఓ మహిళతో అతనికి చాన్నాళ్లుగా లైంగిక బంధం ఉన్నా.. అతను మాత్రం ఆమెను పెళ్లాడేందుకు నిరాకరించాడు. దీంతో ఈ కేసుకు ప్రాముఖ్యత వచ్చింది. ఈ కేసులో అనేక అనుమానాలు తలెత్తడంతో.. అటార్నీ జనరల్ సలహాలను సుప్రీం కోరింది. ఈ కేసులో సెప్టెంబర్ 12న తదుపరి విచారణ జరగనున్నది.

click me!