భారత్- చైనా సరిహద్దు గ్రామంలో ప్రధాని ప్రసంగం.. ఏం మాట్లాడారంటే ?

Published : Oct 21, 2022, 07:50 PM ISTUpdated : Oct 21, 2022, 08:05 PM IST
భారత్- చైనా సరిహద్దు గ్రామంలో ప్రధాని ప్రసంగం.. ఏం మాట్లాడారంటే ?

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చైనా సరిహద్దులో ఉన్న ఓ మారుమూల గ్రామంలో శుక్రవారం ప్రసంగించారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని, వాటిని కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 

ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ చైనా సరిహద్దులోని చివరి గ్రామమైన బద్రీనాథ్ మనాలో శుక్రవారం జరిగిన సభలో ప్రసంగించారు. లోకల్ ఫర్ వోకల్ ఇనిషియేటివ్‌ను ప్రోత్సహించాలని అన్నారు. స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రైలు ఢీకొని పెద్ద పులి మృతి.. మహారాష్ట్రలోని రాజూరా అటవీ ప్రాంతంలో ఘటన

‘‘దేశంలోని పర్యాటకులందరూ తమ ప్రయాణ బడ్జెట్‌లో కనీసం 5 శాతాన్ని స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వెచ్చించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ గ్రామం అంతర్జాతీయ సరిహద్దులు, సుదూర ప్రాంతాలకు సమీపంలో ఉందని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రతి గ్రామాన్ని ఇప్పుడు భారతదేశంలోని మొదటి గ్రామంగా పరిగణిస్తామని ప్రధాని మోడీ చెప్పారు. 

నన్ను రాష్ట్రపతిని చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్.. కోర్టు ఏమన్నదంటే?

ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా విశ్వాస కేంద్రాలను ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురిచేశాయని అన్నారు. ఈ ప్రదేశాలు కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. కాశీ విశ్వనాథ దేవాలయం, ఉజ్జయిని, అయోధ్యలో ఇటీవలి సంవత్సరాలలో పెద్ద ఎత్తున పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆయన ఉదహరించారు. ఈ ప్రదేశాలు ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురయ్యాయని, వారి బానిస మనస్తత్వానికి అవి కారణం అని అన్నారు.

ఈ సందర్భంగా దాదాపు రూ. 1,000 కోట్ల విలువైన రోడ్ల విస్తరణ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇవి రెండు రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు (మన నుండి మనా పాస్ (ఎన్ హెచ్ 07), జోషిమత్ నుండి మలారి (ఎన్ హెచ్ 107బీ) వరకు) - మన సరిహద్దు ప్రాంతాలను కలుపుతాయి. అంతకు ముందు బద్రీనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

అరుణాచల్ ప్రదేశ్ లో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్.. ఇద్దరి మృతదేహాలు వెలికితీత..

కేదార్‌నాథ్‌లో లో కూడా ఆయన రోప్‌వే ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఇది దాదాపు 9.7 కి.మీ పొడవు ఉంటుంది. గౌరీకుండ్‌ని కేదార్‌నాథ్‌ని కలుపుతుంది. రెండు ప్రదేశాల మధ్య ప్రయాణ సమయాన్ని ప్రస్తుతం 6-7 గంటల నుండి 30 నిమిషాలకు తగ్గిస్తుంది. రోప్‌వే నిర్మాణానికి రూ.2,430 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 

పోలీసు కస్టడీలో ఆర్మీ జవాను, ఆయన సోదరుడికి దారుణమైన టార్చర్, వేలు విరిచి తీవ్రంగా దాడి

ఇదిలా ఉండగా.. స్థానిక ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ భారతీయులను ప్రోత్సహిస్తున్నారు. స్థానిక ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచడంతోపాటు దేశీయ పరిశ్రమలకు డిమాండ్‌ను పెంచే లక్ష్యంతో 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్