ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ: కీలకాంశాలపై చర్చ

By narsimha lodeFirst Published Aug 7, 2022, 12:11 PM IST
Highlights

నీతి ఆయోగ్ సమావేశం ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. న్యూఢిల్లీలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం లు కూడా హాజరు కాలేదు. 

న్యూఢిల్లీ: ప్రధాని Narendra Modi  అధ్యక్షుతన Niti Ayog సమావేశం ఆదివారం నాడు న్యూఢిల్లీలో ప్రారంభమైంది.ఈ సమావేశానికి తెలంగాణ సీఎం KCR , బీహార్ సీఎం Nitish Kumar లు హాజరు కాలేదు.. నీతి ఆయోగ్ ఏడవ పాలక వర్గ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. కరోనా కారణంగా 2019 నుండి నీతి ఆయోగ్ సమావేశాలు వర్చువల్ గా సాగాయి.

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్రం వివక్ష చూపుతుందని ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం నాడు ప్రకటించారు.అందుకే ఈ సమావేశానికి తాను హాజరు కావడం లేదని కూడా ప్రకటించారు. అయితే  నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ హాజరుకావొద్దని నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని నీతి ఆయోగ్ శనివారం నాడు రాత్రి ప్రకటించారు.  బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు.

పంట మార్పు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, వ్యవసాయ సంఘాల్లో స్వయం సమృద్దిని సాధించడం, జాతీయ విద్యా విధానం, ఉన్నత విద్యా విద్య అమలు, పట్టణ పలన వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఈ ఏడాది జూన్ మాసంలో హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో కేంద్రం, రాష్ట్రాలు చేసిన ఆరు నెలల సుదీర్థ కఠోర కసరత్తుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సమావేశం ముగిసిన తర్వాత  నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. 

అన్ని రాష్ట్రాల , కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది జీ 20 సమ్మిట్ కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో నీతి ఆయోగ్ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.
 

click me!