ఏషియానెట్ న్యూస్ - ఎన్‌సీసీ వజ్ర జయంతి యాత్ర.. ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించిన రజనీకాంత్..

By Sumanth KanukulaFirst Published Aug 7, 2022, 11:26 AM IST
Highlights

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ చేపట్టిన వజ్ర జయంతి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏషియానెట్ నెట్‌ నెట్‌వర్క్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ చేపట్టిన వజ్ర జయంతి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏషియానెట్ నెట్‌ నెట్‌వర్క్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎన్‌సీసీ క్యాడెట్లతో కలిసి ఏషియానెట్ న్యూస్ నెట్ వర్క్ ఈ యాత్రను కొనసాగిస్తుంది. కేరళలో ప్రారంభమైన ఏషియా నెట్ వజ్ర జయంత్రి యాత్ర.. అక్కడి ముఖ్యమైన ప్రదేశాల‌లో విజయవంతంగా సాగింది. తర్వాత కర్ణాటకలో ప్రవేశించి.. అక్కడ కూడా విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుంది. 

ఎన్‌సీసీతో కలిసి ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ సాగిస్తున్న వజ్ర జయంతి యాత్ర.. ఇప్పుడు మధ్య భారత్‌కు చేరుకుంది. వజ్ర జయంతి యాత్ర మధ్య భారత పర్యటనను ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీలోని అశోకా హోటల్‌లో బస చేస్తున్న రజినీకాంత్‌ను.. అక్కడే ఉన్న వజ్ర జయంతి యాత్ర బృందం కలిసింది. ఈ సందర్భంగా వజ్ర జయంతి యాత్ర.. మధ్య భారత పర్యటనను రజనీకాంత్ ప్రారంభించారు. అలాగే.. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల ఛాయచిత్రాలతో కూడిన పోస్టర్‌ను కూడా రజినీకాంత్ ఈ సందర్భంగా విడుదల చేశారు.

ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్, ఎన్‌సీసీ క్యాడెట్లతో కలిసి చేపట్టిన వజ్ర జయంతి యాద్ర.. దేశంలోని స్వాతంత్ర్య ఉద్యమ స్మారకాలు, మిలిటరీ స్థావరాలు, వ్యవసాయ, సాంస్కృతిక, శాస్త్రీయ పరిశోధన కేంద్రాల గుండా సాగుతుంది. దేశంలోని కీలక ప్రాంతాల గుండా సాగే యాత్ర దేశ సంపద,  సామర్థ్యం గురించి పార్టిసిపెంట్లలో ఒక అవగాహన కలుగ చేస్తుంది.

ఇక, 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్.. వారి గొప్పతనాన్ని వివరిసస్తూ  వీడియోలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 

click me!