ప్రధాని మోడీ వైద్యానికి సొంత డబ్బులే ఉపయోగిస్తారు.. ప్రభుత్వం భరించడం లేదు - ఆర్టీఐ ద్వారా వెల్లడి

By team teluguFirst Published Jan 9, 2023, 2:43 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ తన ఆరోగ్యం కోసం సొంత డబ్బులే ఖర్చు చేస్తారని పీఎంవో స్పష్టం చేసింది. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వైద్య ఖర్చులకు కేటాయించలేదని పేర్కొంది. 

ప్రపంచంలో అత్యధిక మంది ఫాలో అవుతున్న నేతల్లో ఒకరైన నరేంద్ర మోడీ.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తన ఆరోగ్యం కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ డబ్బును ఖర్చు పెట్టలేదు. ఆయన సొంత డబ్బులే దాని కోసం ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానం స్పష్టం చేసింది. 

చందా కొచ్చర్ దంపతులకు ఊరట.. అరెస్ట్ చట్టానికి అనుగుణంగా లేదని హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

ప్రధాని నరేంద్ర మోడీ ఆరోగ్యం కోసం భారతదేశంలో, విదేశాలలో ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వ నిధులను ఉపయోగించారు అని పుణెకు చెందిన ఆర్టీఐ కార్యకర్త ప్రఫుల్ సర్దా ప్రధానమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ప్రధాని మంత్రి కార్యాలయం సమాధానం ఇచ్చింది. ప్రధాన మంత్రి ఆరోగ్యం కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేయలేదని ప్రత్యుత్తరం వచ్చింది. 

తమిళనాడు వదిలివెళ్లండని నినాదాలు.. అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్

పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) కేంద్ర మంత్రులకు అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని పీఎంవో పేర్కొంది. అయినప్పటికీ వాటిని ప్రధాన మంత్రి ఉపయోగించుకోలేదని తెలిపింది. ప్రధాని తన వైద్య ఖర్చులన్నింటినీ చెల్లిస్తున్నారని, ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని పేర్కొంది.

ఈ ఆర్టీఐ దరఖాస్తుకు ప్రధాని కార్యాలయ కార్యదర్శి బినోద్ బిహారీ సింగ్ స్పందిస్తూ.. ప్రధానమంత్రి వ్యక్తిగత వైద్య చికిత్స కోసం ప్రభుత్వ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. ‘‘ఈ కార్యాలయంలో అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత వైద్య చికిత్స కోసం ఎలాంటి ఖర్చు చేయలేదు’’ అని సమాధానం ఇచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు భారత్, విదేశాల్లో ఎలాంటి ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు.

తాంత్రికుడి మాటలు విని నాలుగు నెలల కుమారుడిని కాళీమాతకు బలిచ్చిన తల్లి.. యూపీలో ఘటన

ఈ సమాధానంపై సామాజిక కార్యకర్త ప్రఫుల్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా ప్రధాని మోడీ బలమైన సందేశాన్ని పంపడమే కాకుండా 135 కోట్ల మంది భారతీయులను ఫిట్ గా ఉండటానికి ప్రేరేపిస్తున్నారని తెలిపారు. ‘‘ పన్ను చెల్లింపుదారుల డబ్బును పీఎం వ్యక్తిగత పనులకు ఉపయోగించడం లేదు. ఇది పాలనపై మనకు విశ్వాసాన్ని పెంచుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ వ్యక్తిగత వైద్య ఖర్చులను స్వయంగా భరించి, ప్రధాని మార్గాన్ని అనుసరించాలి ’’ అని ఆయన అన్నారు. 

click me!