సెక్రటేరియట్ లో వీడియోకాన్ఫరెన్స్... పోర్న్ వీడియో కలకం

By telugu teamFirst Published Jun 5, 2019, 9:37 AM IST
Highlights

రాజస్థాన్ సెక్రటేరియట్ లో జరిగిన ఓ సంఘటనలో అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో పోర్న్ వీడియో కలకలం సృష్టించింది.

రాజస్థాన్ సెక్రటేరియట్ లో జరిగిన ఓ సంఘటనలో అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో పోర్న్ వీడియో కలకలం సృష్టించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆ శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫనెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో స్క్రీన్ పై పొర్న్ వీడియో దర్శనమిచ్చింది. అంతే... ఒక్కసారిగా అధికారులు కుంగుతిన్నారు. 

రాజస్థాన్‌ ఆహార, పౌర సరఫరాల కార్యదర్శి ముగ్ధాసింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె అధ్యక్షతన ఎన్‌ఐసీ రూంలో సోమవారం పౌరసరఫరాల శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 10 మంది ఉన్నతాధికారులతో పాటు రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

 వీడియో కాన్ఫరెన్స్‌ జరుగుతుండగా.. తెరపై ఒక్కసారిగా పోర్న్ వీడియో ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. ఈ ఘటనపై ముగ్ధాసింగ్‌ స్పందించారు. దీనికి కారణమైన అధికారి తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

click me!