మోడీ పర్యటనలో భద్రతా లోపం: ఖండించిన బ్రిటీష్ సిక్కు అసోసియేషన్.. ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్

Siva Kodati |  
Published : Jan 09, 2022, 05:29 PM IST
మోడీ పర్యటనలో భద్రతా లోపం: ఖండించిన బ్రిటీష్ సిక్కు అసోసియేషన్.. ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్

సారాంశం

భద్రతా లోపం కారణంగా ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం జాతీయంగా, అంతర్జాతీయ పెను దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో యూకే కేంద్రంగా పనిచేస్తోన్న బ్రిటీష్ సిక్కు సంఘం స్పందించింది. ప్రధాని మోడీ పర్యటనకు అంతరాయం కలిగించిన గ్రూపులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదివారం బ్రిటీష్ సిక్కు సంఘం ఓ ప్రకటన విడుదల  చేసింది. 

భద్రతా లోపం కారణంగా ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం జాతీయంగా, అంతర్జాతీయ పెను దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై వాస్తవాలను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాలు ప్రత్యేక కమిటీలను నియమించగా.. ఇప్పటికే పంజాబ్ డీజీపీపై వేటు కూడా పడింది. ఇదేసమయంలో బీజేపీ- కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో యూకే కేంద్రంగా పనిచేస్తోన్న బ్రిటీష్ సిక్కు సంఘం స్పందించింది. ప్రధాని మోడీ పర్యటనకు అంతరాయం కలిగించిన గ్రూపులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదివారం బ్రిటీష్ సిక్కు సంఘం ఓ ప్రకటన విడుదల  చేసింది. 

మోడీ పర్యటనకు అంతరాయం కలిగించిన కొందరు దారి తప్పిన వ్యక్తులు.. పంజాబ్‌కు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రధాని వచ్చారన్న సంగతిని గుర్తించాలని బ్రిటీష్ సిక్కు సంఘం ఛైర్మన్ లార్డ్ రామి డేంజర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్‌లో రూ.42,750 కోట్ల విలువైన అభివృద్ధి ప్రకటను ప్రధాని చేయాల్సి వుందని డేంజర్ అన్నారు. 

ఇంకా  ఆ లేఖలో ఏమన్నారంటే.. ‘‘ ప్రధానమంత్రి భారత ప్రభుత్వానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనన అధిపతి. ఆయన ఒక రాష్ట్రానికి కాకుండా దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తారు. దేశాన్ని నడిపించాల్సిన నాయకుడి అధికారాన్ని ఎవరూ అణగదొక్కకూడదు.  ప్రజలను కలవడానికి, పలకరించడానికి తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేందుకు ఆయన వచ్చారు. కొందరు గుంపు కారణంగా మోడీ పర్యటనకు ఆటంకం కలిగింది. అదే సమయంలో పార్లమెంట్‌లో తన బలం కోసం ప్రధాని పంజాబ్‌పై మాత్రమే ఆధారపడలేదని బ్రిటీష్ సిక్కు అసోసియేషన్ గుర్తుచేసింది. 

వాస్తవానికి పంజాబ్ భవిష్యత్తు, అభివృద్ధి ప్రధానమంత్రి చిత్తశుద్ధిపై ఆధారపడి వుంటుంది. సరిహద్దు రాష్ట్రంగా వున్నందున, ఉగ్రవాదం.. పక్కదేశం సరఫరా చేసే మాదక ద్రవ్యాలపై పోరాడటానికి పంజాబ్‌కు కేంద్రం సహాయం ఆవశ్యకమని బ్రిటీష్ సిక్కు అసోసియేషన్ తెలిపింది. పంజాబ్ నాయకులు ప్రధానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని,  తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చినందుకు సానుభూతి చూపాలని పిలుపునిచ్చింది. దీనిపై త్వరలోనే గుణపాఠం నేర్చుకుంటారని అసోసియేషన్ ఆకాంక్షించింది. 

కాగా...పంజాబ్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం భటిండా విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పుర్‌లోని హుస్సేనీవాలాలో ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన హెలికాప్టర్‌ ప్రయాణానికి వాతావరణం ప్రతికూలంగా మారింది. దీంతో దాదాపు 20 నిమిషాలు విమానాశ్రయంలోనే ప్రధాని వేచి చూశారు. వాతావరణం మెరుగుపడకపోవడంతో.. రోడ్డు మార్గంలోనే హుస్సేనీవాలాకు వెళ్లాలని మోడీ నిర్ణయించుకున్నారు. ప్రధాని భద్రతా సిబ్బంది ఈ సమాచారాన్ని పంజాబ్‌ పోలీసులకు అందించారు. 

దీనిపై స్పందించిన పంజాబ్ డీజీపీ.. రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి సంబంధించిన అనుమతులు రావడంతో ప్రధాని భటిండా ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరారు. గమ్యస్థానం మరో 30 నిమిషాల్లో సమీపిస్తుందనగా.. మోడీ కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో గానీ 100 మంది రైతులు ఆ రహదారిని దిగ్బంధించారు. దీంతో కారులోనే ప్రధాని కాసేపు వేచిచూశారు. ఎంతకీ పరిస్థితి మెరుగుపడక ప్రధాని తిరిగి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ చేరుకున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Condom Sale: ఒకే వ్య‌క్తి ల‌క్ష రూపాయ‌ల కండోమ్స్ కొనుగోలు.. 2025 ఇయ‌ర్ ఎండ్ రిపోర్ట్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు
IMD Rain Alert : ఇక మంచు తుపాను బీభత్సం... ఆ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!