ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 100 తగ్గింపు: మోడీ ప్రకటన

Published : Mar 08, 2024, 09:01 AM ISTUpdated : Mar 08, 2024, 09:44 AM IST
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర  రూ. 100 తగ్గింపు: మోడీ ప్రకటన

సారాంశం

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 తగ్గిస్తున్నట్టుగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.

న్యూఢిల్లీ: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్  ధరను రూ. 100 తగ్గిస్తున్నట్టుగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  శుక్రవారంనాడు ప్రకటించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా  మోడీ తెలిపారు.

 

సోషల్ మీడియా వేదికగా  ప్రధాని ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.వంట గ్యాస్ ను మరింత చౌకగా మహిళలకు అందించడం ద్వారా   ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించినట్టుగా  మోడీ చెప్పారు ఉజ్వల యోజన కింద పేద మహిళలకు ఇచ్చే ఎల్‌పీజీ సిలిండర్ సబ్సిడీపై రూ. 300 పథకాన్ని పొడిగిస్తూ  గురువారం నాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

 

మహిళలకు సాధికారిత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రధాని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో పోస్టులో  మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. నారీ శక్తి బలం, ధైర్యానికి అభివాదం చేస్తున్నామన్నారు.విద్య,వ్యవసాయం, టెక్నాలజీ వంటి అంశాల్లో మహిళలకు సాధికారిత కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ చెప్పారు.గత దశాబ్దంలో  ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఇది కూడ ప్రతిబింబిస్తుందని మోడీ పేర్కొన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !