PM Modi: ప్రపంచలోనే నెంబర్‌ వన్‌గా మోదీ.. అత్యంత జనామోదం పొందిన ప్రపంచ నాయకుల జాబితాలో అగ్రస్థానం..

By team teluguFirst Published Nov 7, 2021, 12:03 PM IST
Highlights

అమెరికన్ పరిశోధనా సంస్థ.. మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) విడుదల చేసిన 'గ్లోబల్ లీడర్ అప్రూవల్ (Global Leader Approval)' రేటింగ్‌లలో అత్యధిక శాతం రేటింగ్‌లతో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. 

ప్రపంచంలోనే ఎక్కువ మంది జనామోదం పొందిన వ్యక్తుల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మరోమారు అగ్రస్థానంలో నిలిచారు. అమెరికన్ పరిశోధనా సంస్థ.. మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) విడుదల చేసిన 'గ్లోబల్ లీడర్ అప్రూవల్ (Global Leader Approval)' రేటింగ్‌లలో అత్యధిక శాతం రేటింగ్‌లతో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. ప్రధాని మోదీ 70 శాతం స్కోర్‌లో అత్యంత జనామోదం పొంది ప్రపంచ నాయకునిగా నిలిచారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 44 శాతం ఆమోదంతో ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. ధనిక దేశాల అధినేతలను సైతం వెనక్కి నెట్టిన మోదీ ప్రజాదరణ గల నేతల్లో టాప్‌లో నిలిచారు. 

ప్రధాని మోదీ తర్వాత మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ 66 శాతంతో రెండో స్థానంలో, ఇటలీ ప్రధాని మారియో డ్రాగి 58 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ (54%), ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ (47%), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (44%), కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడూ (43%), జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా (42%), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ (41%), బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (40%), స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ (37%), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ (36%), బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (35%)‌ నిలిచారు. 

Also read: 130 కోట్ల భారతీయుల ఆశీర్వాదాలు తెచ్చా: నౌషీరాలో ఆర్మీ జవాన్లతో మోడీ దీపావళి వేడుకలు

2014 భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తన పాపులారిటీ పెంచుకుంటూ పోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

 

PM ji continues to be the most admired world leader.

With an approval rating of 70% he once again leads among global leadershttps://t.co/zlyROFfBIV pic.twitter.com/3fa2O4cW0M

— Piyush Goyal (@PiyushGoyal)

అమెరికా పరిశోధనా సంస్థ మార్నింగ్ కన్సల్ట్ రేటింగ్స్‌లో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలో ప్రధాన మంత్రి మోదీని.. అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వాధిపతిగా మార్నింగ్ కన్సల్ట్ (Most Popular Head of Government) పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా.. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన నేతగా మోదీ ఉన్నారని మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది. 13 దేశాల నాయకులను వెనక్కినెట్టి మోదీ.. 70 శాతంతో జాబితాలో అగ్రస్థానం సంపాదించారని తెలిపింది. 

Also read: UP Assembly Polls: ఎన్నికల్లో పోటీపై యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు

నవంబర్ 4, 2021 నాటికి.. సగటు భారతీయులలో 70 శాతం మంది (అక్షరాస్యుల జనాభా ప్రతిపాదికన) ప్రధాని మోదీని ఆమోదించగా.. కేవలం 24% మంది మాత్రమే ఆయన నాయకత్వాన్ని ఆమోదం తెలుపలేదని మార్నింగ్ కన్సల్ట్ రేటింగ్ పేర్కొంది. ఇక, ఈ యూఎస్ పరిశోధనా సంస్థ.. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రభుత్వ నాయకుల అప్రూవల్ రేటింగ్‌ను ట్రాక్ చేస్తుంది.

click me!