కొడైకెనాల్: లోయలో పడ్డ కారు... మూడునెలల చిన్నారి సహా తల్లికూతుళ్ల దుర్మరణం

By Arun Kumar PFirst Published Nov 7, 2021, 11:09 AM IST
Highlights

ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తూ అదుపతప్పిన కారు దాదాపు 200మీటర్ల లోయలో పడిపోవడంతో మూడు నెలల చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డుప్రమాదం కొడైకెనాల్ సమీపంలో చోటుచేసుకుంది. 

కొడైకెనాల్: ఘాట్ రోడ్డుపై వెళుతుండగా కారు అదుపుతప్పి లోయలో పడటంతో మూడు నెలల పసిగుడ్డుతో సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ ఘోర ప్రమాదం తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం కొడైకెనాల్ లో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... tamilnadu state లోని మధురై జిల్లా సమయనల్లూరు సమీపంలోని తేనూరులో గోకుల్, భారతి దంపతులు నివాసముంటున్నారు. ఈ దంపతులకు మూడునెలల వయసున్న చిన్నారి కూతురుంది. గోకుల్ మధురై హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుండగా భారతి గృహిణి. 

ఈ దంపతులు కూతురితో సరదాగా గడిపేందుకు సొంత కార్లో కొడైకెనాల్ వెళ్ళారు. వీరితో పాటు భారతి తల్లి అళగురాణి(48), సోదరుడు కార్తికేయన్(25) కూడా వెళ్ళారు. వీరంతా కలిసి కొడైకెనాల్ లో ప్రకృతి అందాలను వీక్షించి తిరుగుపయనమయ్యారు. 

read more  తాడిపత్రి: 20మంది కూలీలతో వెళుతుండగా యాక్సిడెంట్... ఒకరు మృతి, నలుగురి పరిస్థితి విషమం

ముందుగా భారతి తల్లి, సోదరుడిని వారి ఇంటివద్ద వదిలిపెట్టడానికి  కొడైకెనాల్‌-అడుక్కమ్‌ రహదారిపై ప్రయాణించారు. అయితే ఇటీవల వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఈ రోడ్డంతా ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో ఘాట్ రోడ్డుపై ఓ మలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. 

దాదాపు 200వందల అడుగుల లోతున్న లోయలో పడటంతో కారులోని చిన్నారితో సహా మహిళలిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. గోకుల్ తో పాటు అతడి బామ్మర్ది తీవ్రంగా గాయపడ్డారు. కారు లోయలో పడుతుండగా చూసినవారు పోలీసులకు సమాచారం అందించారు.  స్థానిక పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది లోయలోపడి పూర్తిగా ధ్వంసమైన కారును గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని బయటకు తీసి వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. 

read more  భూపాలపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం... ఎస్సై సహా నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు

అనంతరం తల్లీ కూతుళ్లతో పాటు చిన్నారి మృతదేహాన్ని కూడా బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తిగా ధ్వంసమైన కారును కూడా లోయలోంచి బయటకు తీసారు. అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

ఇద్దరు కూలీలను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం

 తాడిపత్రి పట్టణం నుండి  బ్రాహ్మణపల్లి గ్రామానికి ఇవాళ ఉదయం 20మంది కూలీలలో ఓ వాహనం బయలుదేరింది. అయితే మార్గమద్యలో చుక్కలూరు క్రాస్  రోడ్డు వద్ద ఈ వాహనం ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతుండగా ఒక్కసారిగి అదుపుతప్పిన వాహనం బోల్తా పడింది. దీంతో ఒకరు అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో 18మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగా గాయపడిన క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చూసారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురు కూలీల పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

ఘటనాస్థలంలోని మృతదేహాలను కూడా పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘోర రోడ్డుప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమయి వుంటుందని అనుమానిస్తున్నారు.
 

click me!