చెన్నైను ముంచెత్తిన భారీ వర్షం: నీట మునిగిన కాలనీలు, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

By narsimha lodeFirst Published Nov 7, 2021, 11:37 AM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు చెన్నై నగరంలో కూడ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

చెన్నై:  Tamilnadu  రాష్ట్ర రాజధాని Chennaiలో ఆదివారం నాడు Heavy Rainfall కురిసింది. భారీ వర్షంతో చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

ఆదివారం నాడు చెన్నై నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలోని కొరటూరు, పెరంబూర్, అన్నాసాలై, టీనగర్, గిండి, అడయార్, పెరుంగుడి, ఓఎంఆర్‌తో సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలమయమైన ప్రాంతాల ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు పుఝల్ రిజర్వాయర్ నుండి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టుగా తిరువళ్లూరు కలెక్టర్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

ఆదివారంతో పాటు మరో ఐదు రోజుల పాటు తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది IMD హెచ్చరించింది. పుదుచ్చేరి, కారైకల్ లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. 

2015లో చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ దఫా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చెన్నై నగంరలో వందలాది కాలనీలు నీటిలో మునిగిపోయాయి. 24 గంటల్లో 15 సెం.మీ పైగా వర్షపాతం నమోదైంది.  చెన్నై కార్పోరేషన్ పరిధిలో కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. చెన్నై, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు లకు ఎన్డీఆర్ఎప్ బృందాలు చేరుకొన్నాయి. కన్యాకుమారి, కాంచీపురం, మధురైలలో కూడా భారీ వర్షం కురిసింది.

తమిళనాడు రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరో వైపు ప్రజా ప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.  

ఈ నెల 9వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు  తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు.శనివారం ఉదయం నుండి చెన్నై, కాంచీపురం , తిరువళ్లూరు జిల్లాలోని అనేక శివారు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 

also read:అల్పపీడనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన.. ఈ తేదీల్లో అతి భారీ వర్షాలు..

గత 24 గంటల్లో తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులోని పరంగిపేటలో 168 మి.మీ వర్షపాతం నమోదైంది. దేశంలో అత్యంత వర్షపాతం నమోదైన నగరంగా రికార్డుల్లో చేరింది.

ఇవాళ ఉదయం ఏడున్నర గంటల వరకు చెన్నైలో 207 మి.మీ వర్షపాతం నమోదైంది. నుంగంబాక్కంలో 145 మి.మీ., విల్లివాక్కంలో 162 మి.మీ. పుజల్ లో 111 మి.మీ వర్షపాతం నమోదైంది. 2015 డిసెంబర్ మాసంలో నమోదైన వర్షపాతం తర్వాత ఇవాళే అధికంగా వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.

click me!