కేదార్‌నాథ్ పర్యటించనున్న ప్రధానమంత్రి మోడీ.. ‘శంకరాచార్యుడి సమాధి పునర్నిర్మాణం’

Published : Oct 17, 2021, 02:10 PM IST
కేదార్‌నాథ్ పర్యటించనున్న ప్రధానమంత్రి మోడీ.. ‘శంకరాచార్యుడి సమాధి పునర్నిర్మాణం’

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల 5న కేదార్‌నాథ్ పర్యటించనున్నారు. అక్కడ పూజలు నిర్వహించి, కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఆది గురువు శంకరాచార్యుడి సమాధినీ ఈ ప్రాజెక్టులో భాగంగానే పునర్నిర్మిస్తున్నారు. దీనికంటే ముందు ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్‌లో కుషీనగర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు.  

డెహ్రడూన్: ప్రధానమంత్రి Narendra Modi వచ్చే నెల 5వ తేదీన Kedarnath పర్యటించనున్నారు. రూ. 250 కోట్ల విలువైన కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టులను ఆయన ఈ పర్యటనలో ప్రారంభించనున్నారు. 2014 ఎన్నికల అనంతరం Prime Ministerగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నరేంద్రమోడీ పలుసార్లు కేదార్‌నాథ్ పర్యటించారు. ఈ నెల 7న ఆయన ఉత్తరాఖండ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 7న రిషికేశ్‌కు వెళ్లారు. అక్కడ ఓ ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించి వచ్చారు. మళ్లీ నవంబర్ 5న ఉత్తరాఖండ్‌కు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ CM పుష్కర్ సింగ్ ధామి ధ్రువీకరించారు. ప్రధాని మోడీ రూ. 250 విలువైన కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించనున్నారని వివరించారు. ఇందులోనే ఆది గురువు శంకరాచార్యుడి సమాధిని పునర్నిర్మించే ప్రాజెక్ట్ ఉన్నది. 

అంతేకాదు, రూ. 150 కోట్ల విలువైన కేదార్‌పురి రెండో దశ పునర్నిర్మాణ ప్రాజెక్టుకూ ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నట్టు సీఎం పుష్కర్ సింగ్ ధామి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నారు. శీతాకాలం సందర్భంగా నవంబర్ 6న కేదార్‌నాథ్ పోర్టల్స్ మూసేయనున్నారు.

Aslo Read: శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం: ఫస్ట్ ఫేజ్ పూర్తి, దర్శనం అప్పటి నుంచే..!!

దీనికంటే ముందు Uttar Pradeshలోని కుషీనగర్‌లో International Airportను ఈ నెల 20న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇతర దేశాల దౌత్యఅధికారులూ హాజరవ్వనున్నారు. శ్రీలంక నుంచి ప్రత్యేక ప్రతినిధుల బృందం వస్తున్నది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లలో మునిగిపోయింది. విదేశీ అతిథులను ఆహ్వానించడానికి ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎం యోగి ఆదిత్యానాథ్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్