ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్క రోజు 14,146 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,40,67,719కి చేరింది.కరోనా కేసులు 229 రోజుల దిగువకు పడిపోయాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
న్యూఢిల్లీ: Indiaలో గత 24 గంటల్లో 14,146 కొత్త Corona కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,40,67,719కి చేరింది.మరో వైపు కరోనాతో 144 మంది చనిపోయారు. నిన్న ఒక్క రోజు 11,00,123 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది.
also read:24 గంటల్లో 111 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,68,833కి చేరిన మొత్తం కరోనా కేసులు
కరోనా కేసులు 229 రోజుల దిగువకు పడిపోయాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,52,124కి చేరింది. మరోవైపు నిన్న 19,788 మంది కరోనా నుండి కోలుకొన్నారు. దీంతో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 3,34,19,749కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా రోగుల రికవరీ రేటు 98.10 శాతానికి చేరిందని వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రకటించారు. మరో వైపు కరోనా యాక్టివ్ కేసులు 1,95,846 కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.57 శాతంగా నమోదైందని ICMR తెలిపింది.దేశంలో నిన్న 41,20,772 లక్షల మందికి Corona vaccine అందింది. ఇప్పటివరకు 97.65 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకొన్నారు.
ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.