ఢీ అంటే ఢీ.. అమెరికా సైన్యంతో ఇండియన్ ఆర్మీ కబడ్డీ.. వీడియో ఇదే..

Published : Oct 17, 2021, 01:18 PM IST
ఢీ అంటే ఢీ.. అమెరికా సైన్యంతో ఇండియన్ ఆర్మీ కబడ్డీ.. వీడియో ఇదే..

సారాంశం

భారత్, అమెరికా బలగాలు నువ్వా అంటే నువ్వా అన్నట్టు పోటాపోటీగా వ్యవహరించాయి. ఒకరిపై ఒకరు కాలు దువ్వి కబడ్డీ ఆడాయి. ఇదంతా కదనరంగంలో కాదు.. ఇరుదేశాలు నిర్వహిస్తున్న ఓ ట్రైనింగ్ కార్యక్రమంలో ఈ క్రీడలు ఆడాయి. కబడ్డీ, ఫుట్‌బాల్, సాకర్, వాలీబాల్ ఆటలు ఆడాయి. ఇరుదేశాల జవాన్లు నాలుగు జట్లుగా (మిక్స్‌డ్) విడిపోయి గేమ్స్ ఆడారు.  

న్యూఢిల్లీ: అమెరికా, భారత బలగాలు ఢీ అంటే ఢీ అనుకున్నాయి. ఇరువురు దేశాల soldiers ఒకరిపై ఒకరు కాలు దువ్వి కలబడ్డారు. ఇదంతా యుద్ధ భూమిలో కాదు.. జాయింట్ ఎక్సర్‌సైజ్ కార్యక్రమాల్లో.. ఇరు దేశాల బలగాలు కలిసి జట్లుగా విడిపోయి కబడ్డీ ఆడారు. ఒకరిపై ఒకరు ఢీ అంటే ఢీ అన్నట్టుగా కూతపెట్టారు. ఫుట్‌బాల్, సాకర్, వాలీబాల్ కూడా ఆడారు. ప్రస్తుతం రెండు దేశాల జవాన్లు ఆడిన kabaddi వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నది.

America ఫస్ట్ స్క్వాడ్రన్‌ 40వ కావల్రీ రెజిమెంట్‌కు చెందిన 300 మంది అమెరికా జవాన్లు, Indian ఆర్మీకి చెందిన 7 మద్రాస్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ 350 మంది సైనికులు అమెరికాలోని అలస్కాలో జాయింట్ ఎక్సర్‌సైజ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 14 రోజుల పాటు ఈ ట్రైనింగ్ షెడ్యూల్ ఉన్నది. ఇందులో కౌంటర్ ఇన్సర్జెన్సీ, కౌంటర్ టెర్రరిజం వంటి అనేక సవాళ్లను అమెరికా దేశ పద్ధతిలో ట్రైనింగ్ ఉంటుంది. 17వ ఎడిషన్‌ ‘ఎక్సర్‌సైజ్ యుద్ధ అభ్యాస్ 21’లు అలస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్ రిచర్డ్‌సన్‌లో శుక్రవారం ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగంగా ఇరుదేశాల జవాన్లు నాలుగు జట్లుగా విడిపోయారు. ఒక్కో జట్టులోనూ ఇరుదేశాల జవాన్లున్నారు. ఈ జట్లు స్నేహపూర్వకంగా అనేక క్రీడలు ఆడాయి. ఈ క్రీడల ద్వారా ఒకరి నుంచి మరొకరు తెలుసుకున్నారని భారత ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత Army నుంచి అమెరికా మిలిటరీ కబడ్డీ గురించి తెలుసుకోగా, భారత ఆర్మీ వారి నుంచి ఫుట్ బాల్‌ తెలుసుకుని, ధీటుగా ఆడిందని వివరించింది.

Also Read: సత్తా చూపిన భారత ఆర్మీ... ‘మిలిటరీ పెట్రోలింగ్ ఒలిపింక్స్‌’లో ఇండియన్ ఆర్మీ టీమ్‌కు గోల్డ్ మెడల్

ఈ క్రీడల ద్వారా ఇరుదేశాల బలగాల మధ్య ఓ సానుకూల వాతావరణం ఏర్పడిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. త్వరలో జరగనున్న ఫైరింగ్, ఇతర కార్యక్రమాలకు ఇది సానుకూలంగా దోహదపడుతుందని వివరించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం