ఈ నెల 14, 15 తేదీల్లో జార్ఖండ్ లో మోడీ టూర్: బిర్సా ముండా స్వగ్రామాన్ని సందర్శించనున్న ప్రధాని

By narsimha lode  |  First Published Nov 13, 2023, 8:43 PM IST


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  జార్ఖండ్  రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.  పలు ప్రాజెక్టులను  మోడీ ప్రారంభిస్తారు. బిర్సా ముండా స్వగ్రామానికి కూడ మోడీ వెళ్లనున్నారు.


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  ఈ నెల  14, 15 తేదీల్లో  జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తారు.  ఈ నెల  15న  రాంచీలోని  భగవాన్ బిర్సా ముంగా మెమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంను ప్రధాన నరేంద్ర మోడీ సందర్శిస్తారు.

ఈ నెల  14, 15 తేదీల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. బిర్సాముండా  జన్మించిన గ్రామానికి కూడ మోడీ వెళ్లనున్నారు. బిర్సా ముండా  జన్మించిన ఉలిహట్టు గ్రామాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  సందర్శించనున్నారు. బిర్సాముండా  గ్రామాన్ని సందర్శించే తొలి ప్రధానిగా  మోడీకి గౌరవం దక్కనుంది.

Latest Videos

undefined

జార్ఖండ్ రాష్ట్రంలోని కుంటిలో  ఉదయం పదకొండున్నర గంటలకు  జరిగే జంజాతీయ గౌరవ్ దివస్ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమంలో  ప్రధానమంత్రి మోడీ పాల్గొంటారు. పీఎంవిక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర, పీఎం పీవీటీజీ డెవలప్ మెంట్ కార్యక్రమంతో పాటు పలు ప్రాజెక్టుల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.

ఈ పథకాల ప్రయోజనాలు నిర్ధేశిత లబ్దిదారులందరికీ  సకాలంలో  చేరేలా చూడడం ద్వారా ప్రభుత్వ ప్రధాన పథకాల సంతృప్తిని పొందేందుకు ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు. పథకాల సంతృప్త లక్ష్యాన్ని  సాధించే దిశగా ప్రధాన మంత్రి జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా  విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభిస్తారు మోడీ.

పారిశుద్య సౌకర్యాలు, ఆర్ధిక సేవలు,విద్యుత్ కనెక్షన్లు, ఎల్ పీ జీ సిలిండర్లు, పేదలకు ఇళ్లు, ఆహార భద్రత, సరైన పోషకాహరం, ఆరోగ్య సంరక్షణ వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించడం, స్వచ్ఛమైన తాగునీరు వంటి వాటిపై  కేంద్రీకరించనున్నారు.విక్షిత్  భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభోత్సవానికి గుర్తుగా జార్ఖండ్ లోని కుంటిలో  ఐఈసీ వ్యాన్ లను  ప్రధానమంత్రి మోడీ  ప్రారంభించనున్నారు. 

 పీఎం-పీవీటీజీ మిషన్ ను కూడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రారంభిస్తారు. గిరిజన ప్రాంతాల్లో మౌళిక సౌకర్యాల కల్పనతో పాటు  ఇతర అంశాలపై కేంద్రీకరించనున్నారు.  రూ. 24 వేల కోట్లతో పీవీటీజీ  కుటుంబాల్లో  మౌలిక వసతులను కల్పించనున్నారు.రోడ్లు, నివాస గృహలు, టెలికం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. 

మరో వైపు  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 8 కోట్లకు పైబడిన  రైతులకు  రూ. 18 వేల కోట్లను ప్రధానమంత్రి విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద  ఇప్పటివరకు  రూ.2.62 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లోకి విడుదల చేసింది కేంద్రం. 14 విడుతలుగా  రైతుల బ్యాంకు ఖాతాల్లో  ప్రభుత్వం నిధులను జమ చేసింది.

 మరోవైపు రూ. 7200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  జాతికి అంకితం చేస్తారు.  రైలు, రోడ్డు, విద్య, బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు వంటి ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

also read:గిరిజనుల సాధికారితకు పీఎం-పీవీటీజీ డెవలప్ మెంట్ మిషన్: ఈ నెల 15న ప్రారంభించనున్న మోడీ

జాతీయ రహదారి  133లోని మహాగామ-హన్స్ దిహా సెక్షన్ లో 52 కి.మీ నాలుగు లైన్ల రోడ్డును  ప్రారంభిస్తారు.  జాతీయ రహదారి 114 ఏ  బాసుకినాథ్-డియోఘర్ సెక్షన్ 45 కి.మీ నాలుగు లైన్ల రోడ్డును ప్రారంభించనున్నారు.

ఐఐఎం రాంచీ కొత్త క్యాంపస్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేస్తారు.   ఐఐటీ ఐఎస్ఎం ధన్ బాద్ కొత్త హస్టల్,  పెట్రోలియ్ ఆయిల్ లూబ్రికెంట్స్ డిపోలను ప్రధాని ప్రారంభిస్తారు.   

click me!